దర్శక ధీరుడు రాజమౌళి తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు తండ్రి కథలనే ఎక్కువగా సినిమా లను చేస్తూ వచ్చాడు. ఇతర రచయితల కథలు ఎంత బాగున్నా కూడా తండ్రి మీద నమ్మకమో లేదా తన మీద భయమో తెలియదు కానీ తండ్రి వద్ద కథలు తప్ప ఏ కథలను కూడా సినిమాలుగా కూడా చేయలేదు రాజమౌళి. ఒక మర్యాద రామన్న సినిమా వేరొక రచయిత తో కలిసి చేశాడు. ఆయన కూడా రాజమౌళి కుటుంబ సభ్యుడు కావడం విశేషం. 

అలా రాజమౌళి ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గర్నుంచి ఇప్పటి ఆర్ ఆర్ ఆర్ సినిమా దాకా అన్ని కూడా తండ్రి కలం నుంచి జాలువారిన కథలనే సినిమాలుగా చేశాడు. దర్శకుడిగా రాజమౌళికి ఎంత పెద్ద పేరు ఉందో అందరికీ తెలిసిందే. సౌత్ ఇండియా లో మాత్రమే కాదు దేశంలో కూడా రాజమౌళిల ఆలోచించి సినిమాలు చేయగలిగే దర్శకుడు లేరు అంటూ ఉంటారు. బాహుబలి సినిమా విషయంలో అది నిరూపితం అయింది. ఆ విధంగా రాజమౌళి టెక్నికల్ గా దర్శకత్వంలో తన నైపుణ్యాన్ని మొత్తం చూపిస్తూ ఉండగా రచయితగా కావాల్సిన అంశాలను ఇప్పటివరకు విజయేంద్రప్రసాద్ సమకూరుస్తూ వచ్చాడు. 

ఇక రాజమౌళి తన తదుపరి సినిమాను మహేష్ బాబు తో చేయాలని ఎప్పటినుంచో చూస్తున్నాడు. అయితే కథ సెట్ కాకపోవడం వల్లనే ఈ సినిమా ఇంత లేట్ అవుతుంది వచ్చింది. మహేష్ బాబు కూడా ఇటీవలే కథ ఓకే కాకపోవడం వల్లనే ఈ సినిమా లేట్ అయ్యింది అని క్లారిటీ ఇచ్చాడు.  ఈ నేపథ్యంలో గతంలో ఎప్పుడూ చేయని విధంగా రాజమౌళి తండ్రిని కాదని మరొక దర్శకుడితో మరొక కథారచయిత తో ముందుకు వెళుతున్నాడు. ఆయన ఎవరో ఇంకా తెలియదు కానీ ఆ కథా రచయిత కథను మహేష్ ఓకే చేసే ఆలోచనలో ఉన్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: