ఎక్క‌డైనా సీనియ‌ర్ల పెత్త‌నం ఉండ‌టం కామ‌న్. సినిమా ఇండ‌స్ట్రీలోనూ సీనియ‌ర్ల పెత్త‌నం ఉందంటూ వారికి ఎదురు చెబితే ఆఫ‌ర్లు రావ‌డం క‌ష్ట‌మేనంటూ ప‌లువురు న‌టీన‌టులు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే . అయితే ఇప్పుడు సీనియ‌ర్లు కొట్ట‌డం భూతులు తిట్ట‌డం కూడా జ‌రుగుతుందంటూ ఆరోపించ‌డం సంచ‌ల‌నం గా మారింది. మా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌ర‌గ్గా ఎన్నో డ్రామాలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే . అయితే తాజాగా మా ఎన్నిక‌ల్లో పోటా చేసి గెలిచిన ప్ర‌కాష్ రాజ్ పాన‌ల్ స‌భ్యులు రాజీనామా చేస్తూ సంచ‌ల‌ప ఆరోణ‌లు చేశారు . 

న‌టుడు బెన‌ర్జీ తన‌కు ఎన్నో ఏళ్ళ నుండి మోహ‌న్ బాబుతో సంబంధాలు ఉన్నాయ‌ని ...మోహ‌న్ బాబు కూతురు మంచు ల‌క్ష్మి, విష్ణుల‌ను ఎత్తుకుని పెంచాల‌న‌ని కానీ మా ఎన్నిక‌ల పోలింగ్ స‌మయంలో మోహ‌న్ బాబు త‌న‌ను కొట్టేందుకు వ‌చ్చార‌ని అన్నారు. అరగంట పాటు అమ్మ‌నా బూతులు తిట్టారని బెన‌ర్జి ఆరోపిస్తూ కంటత‌డి పెట్టుకున్నారు . ఆ త‌ర‌వాత మైక్ అందుకున్న తనిష్ మాట్లాడుతూ త‌న‌ను మోహ‌న్ బాబు తిడుతుండ‌గా బెన‌ర్జీ వ‌చ్చి ఆపార‌ని దాంతో మోహ‌న్ బాబు ఆయ‌న‌పై ఆగ్ర‌హానికి గురయ్యారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న త‌ల్లిని కూడా మోహ‌న్ బాబు తిట్టారంటూ తనిష్ కంట‌తడి పెట్టుకున్నారు .

మ‌రో వైపు న‌టుడు ఉత్తేజ్ మాట్లాడుతూ త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి సీనియ‌ర్ న‌రేష్ ఎన్నిక‌ల త‌ర‌వాత ఒక్కో ల‌*** కొడుకు సంగ‌తి చెబుతానంటూ వార్నింగ్ ఇచ్చార‌ని చెప్పారు. అయితే దారుణంగా తిట్ట‌డం వ‌ల్లే వీరంద‌రూ మీడియా ముందుకు వ‌చ్చామ‌ని చెబుతున్నారు. అంటే సాధార‌ణంగానే ఇండ‌స్ట్రీలో పెద్ద‌వాళ్ల చేతిలో తిట్లు తినడం కొత్త‌వారికి త‌ప్ప‌దేమో అనే అనుమానాలు వ‌స్తున్నాయి. అంతే కాకుండా ఈ బూతు పురాణం ..దాడులు చూస్తే సినిమాల్లోకి రావాల‌న్న ఇంట్రెస్ట్ ఉన్న‌వాళ్లు కూడా బ‌య‌ప‌డి వెన‌క‌డుగు వేసే ప్ర‌మాదం ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: