మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను చక చక పూర్తి చేస్తూ ఇప్పటికే ఫిబ్రవరి నెలలో విడుదల చేయబోతున్నట్టు విడుదల తేదీని కూడా ప్రకటించాడు. ఈ సినిమాలు చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. మరియు ఈ సినిమాతో పాటు మలయాళంలో సూపర్ హిట్ అయినా నా లూసిఫర్ మూవీ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాను కూడా మెగాస్టార్ చిరంజీవి శర వేగంగా పూర్తి చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఓ హాలీవుడ్ స్టార్ భాగస్వామ్యం అవబోతుంది అని వార్తలు వస్తున్నాయి.  

హాలీవుడ్ స్టార్ బ్రిట్నీ స్పియ‌ర్ అని టాక్‌ నడుస్తోంది. వివ‌రాల్లో కెళ్తే, గాడ్ ఫాద‌ర్  మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయ‌న ఓ పాట‌ను బ్రిట్నీస్పియ‌ర్‌తో పాడించాల‌ని అనుకుని, ఆమెతో చ‌ర్చ‌లు కూడా చేశాడ‌ని వార్త‌లు వస్తున్నాయి. మరి ఈ వార్తల పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది ఇలా ఉంటే ఈ రెండు సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి తమిళ సూపర్ హిట్ వేదాళం సినిమా కు రీమేక్ గా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమా లో కూడా నటించడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో కూడా మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమాలో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొన్ని రోజుల క్రితమే జరిగింది. ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: