బాహుబలి సినిమా ప్రభాస్ తెలుగు హీరోలు ఎవరు అందుకోలేని ఎత్తులో కూర్చోపెట్టింది. ఈ సినిమా తర్వాత వచ్చిన సాహో పెద్దగా హిట్ కాకపోయినా కూడా కలెక్షన్స్ ల విషయంలో ఎక్కడ తగ్గలేదు. అయితే ప్రభాస్ తన ఒక్కొక్క సినిమాకి ఆయన క్రేజ్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు. బాహుబలి కి ప్రభాస్ కి 50 కోట్లకి పైగా రెమ్యూనరేషన్ ఇవ్వగా ఆ తర్వాత వచ్చిన సాహో సినిమాకి 70 కోట్ల వరకు తీసుకున్నారు.

ఇక ఈ మధ్య ఆయన వరసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ రెమ్యూనరేషన్ కూడా పెంచుతూ వెల్లడు. ప్రస్తుతం ప్రభాస్ ఒక్క సినిమాకి 100 కోట్లా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అని టాక్. కానీ ఆదిపురుష్  ,సాలర్ ,  నాగ అశ్విన్ సినిమాలకి మాత్రమే ఈ రెమ్యూనరేషన్ . ఆయన కొత్తగా సందీప్ రెడ్డి వంగా సినిమా స్పిరిట్ కి ప్రభాస్ యకంగా 150 కోట్లు తీసుకుంటున్నాడు అని టాక్. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదలు కాబోతుంది. స్పిరిట్ ఒక్క ఇండియాలోనే కాకుండా ఆసియ అంత విడుదల కాబోతుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా కథ ఏ రేంజ్ లో ఉండబోతోందో.

ఒక తెలుగు నటుడు ఇంత ఎత్తుకు ఎదగడం మన అందరికి గర్వకారణం అన్న విషయం అయితే ఒప్పుకోవాల్సిందే. ఇక ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు . ఈ సినిమా అయిపోతే సాలర్ కూడా కంప్లీట్ చేసి నాగ అశ్విన్ సినిమా మీద ప్రభాస్ ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారు. ఇక  ఇవే కాకుండా బాలీవుడ్ దర్శకుడు సిద్దార్ద్ ఆనంద్ డైరెక్షన్ లో ఒక సినిమా అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇంకొక సినిమా కూడా ప్రభాస్ అంగీకరించారు అని వీటి అనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతుంది అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: