మా ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా సాగి... ఇటీవలె ఫలితాలు కూడా బయట పడ్డాయి. అయితే మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు బయటపడ్డ... అసోసియేషన్ సభ్యుల మధ్య మాత్రం వివాదాలు రాజు కుంటూనే ఉన్నాయి. టైం దొరికితే చాలు మీడియా ముందుకు వచ్చి తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు అసోసియేషన్ సభ్యులు. దీంతో అటు మీడియాకు ఇటు ప్రజలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం పక్క దొరుకుతాయి. ముఖ్యంగా మీడియాకు మా అసోసియేషన్ ఎన్నికలు చాలా.. ఎంటర్టైన్మెంట్ గా మారాయి. ఒకరిపై ఒకరు తిట్టి పోసుకుంటుంటే...  అటు జనాలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మంచు విష్ణు గెలవడంతో... ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులకు ఊహించని షాక్ తగిలింది. దీంతో చేసేదేమీ లేక... గెలిచిన సభ్యులు కూడా ఇటీవల రాజీనామా చేసారు. 

మంచిగా కూర్చుని మాట్లాడుకుందాం అని మంచు విష్ణు ప్యానల్ బృందం చెబుతున్నప్పటికీ అసలు సమస్య లేదంటూ ప్రకాష్ రాజు చానల్ బృందం ససేమిరా అంటోంది. తాము అసోసియేషన్ సభ్యులుగా ఉంటే మీకు అనేక ఆటంకాలు రావచ్చు... లేదా మీ పనులకు తాము అడ్డం రావచ్చు... ఈ నేపథ్యంలోనే తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్రాజ్ ప్యానెల్ సభ్యులు ప్రకటించారు. రాజీనామాలు మాత్రమే చేయకుండా... మా ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నరేష్ పై విరుచుకుపడ్డారు ప్రకాష్ రాజ్‌ ప్యానల్ సభ్యులు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ను నాశనం చేస్తున్నాడు అంటూ ఆయనపై... తమ అక్కసును మొత్తం మీడియా ముందు వెళ్లగక్కారు. ఇంకేముంది మళ్లీ వివాదాలు తెరపైకి వచ్చాయి.

ప్రకాష్ రాజు ప్యానల్ సభ్యులు తిట్టారని... నరేష్ కూడా తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చాడు. ప్రధాని మోడీ గెలిచాడని కాంగ్రెస్ పార్టీ దేశాన్ని వదిలి పోయిందా...? మీరెందుకు మంచు విష్ణు ప్యానల్ గెలిస్తే... రాజీనామాలు చేస్తున్నారు అంత తీవ్రస్థాయిలో మండిపడ్డారు నరేష్. అసలు మగాళ్ళ మాట్లాడటం లేదంటూ కూడా చురకలంటించారు నరేష్. దీంతో మా అసోసియేషన్ ఆర్టిస్ట్ సభ్యుల వివాదం తారాస్థాయికి చేరింది. ఈ వివాదం ఇలాగే చెలరేగితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ రెండుగా చీలి పోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ వివాదాలు ఎంత త్వరగా పరిష్కారం అవుతాయో అప్పుడే టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మంచి రోజులు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: