తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అన్నది మనము చూస్తూనే ఉన్నాము. కొన్ని కుటుంబాల నుండి వచ్చిన వారసులు తల్లితండ్రులతో సంబంధం లేకుండా సక్సెస్ సాధించారు. కానీ ఇంకా కొంతమంది సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అలంటి వారసులతో ఒకరే టాలీవుడ్ మన్మదుడు అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినా ఇంకా తనకు సాలిడ్ హిట్ పడలేదు. ఎంతో కాలంగా హిట్ కోసం వాటి చేస్తున్నాడు. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని నాగార్జున సలహాతో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో సినిమా చేశాడు. ఈ సినిమా షూటింగ్ అయిపోయింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది. రేపు గ్రాండ్ గా అఖిల్ నటించిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ " మూవీ థియేటర్ లో విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్, ట్రైలర్ మరియు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా బృందం ఖచ్చితంగా సినిమా ఘన విజయాన్ని అందుకుంటుదని నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే అఖిల్ సరసన నటించింది. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది. ఇదిలా ఉంటేరేపు ఈ చిత్రం విజయదశమి కానుకగా విడుదల కానుండడంతో అఖిల్ తో పాటు నాగార్జున సైతం ఎంతో ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా అఖిల్ అక్కినేని తన ఇంస్టా గ్రామ్ ద్వారా ఒక రీల్ ను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఇది ఇప్పుడు వీర ల గా మారింది. దారిలో తలకు క్యాప్ వేసుకుని షూస్ గాల్లోకి విసిరేస్తున్న వీడియోతో అఖిల్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దీనిని బట్టి సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం సాలిడ్ గా ఉన్నట్టుంది. మరి ఎంత మేరకు వీరి నమ్మకం నిజం అవుతుందో తెలియాలంటే రేపటి వరకులు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: