ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో జరిగిన విషయం తెలిసిందే.ఎంతో హోరా హోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపొందాడు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాక..'మా'లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది.ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి చెందిన 11మంది ఇప్పటికే తమ రాజీనామాలను ప్రకటించారు.ఈ 11 మంది సభ్యులు కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి గెలుపొందిన వారే.అయితే ఓడిపోయారనే కోపంతో వీళ్ళు రాజీనామా చేశారని అనుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రకాష్ రాజ్ రాజకీయం కూడా కనిపిస్తోంది.గత రెండు పర్యాయాలు చూసుకుంటే..మిక్స్ డ్ ప్యానెల్సే కనిపించాయి.

అంటే రెండు ప్యానెల్స్ తరపు నుండి పోటీ చేసి గెలుపొందిన వాళ్ళు అంతా కలిసి ఒక ప్యానెల్ గా ఏర్పడి ఆ రెండేళ్ళు ఉంటారు.అయితే రెండు వేరు వేరు ప్యానెల్స్ నుండి వచ్చిన వాళ్ళు కావడంతో మధ్యలో ఆరోపణలు, విమర్శలు, చురకలు ఇలా చాలానే ఉంటాయి.ఒకరు చేసిన, చేద్దామని అనుకున్న పనులు.. వేరే ప్యానెల్ నుండి గెలిచిన సభ్యులు వద్దని అంటారు.ఇప్పుడు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి గెలిచిన వాళ్ళు కూడా ఇదే మాట చెప్పి రాజీనామా చేశారు.దీంతో ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.అయితే ప్రకాష్ రాజ్ మాత్రం గతంలా కాకుండా చేసిన ప్రతీ పనిలో తప్పులు వెతుకుతున్నారు.

అయితే ఈ పని నిర్మాణాత్మకంగా ఉంటే అందరూ హర్షిస్తారు.అలా కాకుండా ప్రతీ చిన్న విషయానికి విమర్శిస్తే మాత్రం కష్టం.అయితే ఈ ఎన్నికల విషయంలో ఇలాంటి విమర్శలే వచ్చాయి.ప్యానెల్ ఫోర్స్ లో ఉండగానే..అందులోని సభ్యులు బయటకి వచ్చి ఆ ప్యానెల్ తరపు ప్రెస్ మీట్ కి వచ్చారని విమర్శించారు.ఇప్పుడు అవసరమైతే ఓ ఆరు నెలల ముందే ప్రెస్ మీట్లు పెట్టి మరీ..మంచు విష్ణు  ప్యానెల్ చేస్తున్న పనులపై మాట్లాడొచ్చు.కాబట్టి ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామాలు  ఓకే చేస్తే..మంచు విష్ణు తన పక్కలో బల్లెం పెట్టుకున్నట్లే అని పలువురు ఇండ్రస్ట్రీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: