ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా స‌మంత అభిమానుల‌కు శుభ‌వార్త చెప్ప‌నుందా అంటే అవున‌నే అంటున్నారు స‌మంత స‌న్నిహిత వ‌ర్గాలు. తెలుగులో ఏమాయ‌చేశావే సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై కుర్ర‌కారుని త‌న‌దైన శైలిలో ఆక‌ట్టుకుంటుంది. నాగ‌చైత‌న్య‌తో  క‌లిసి తొలుత స‌మంత న‌టించిన  ఏమాయ‌చేశావే చిత్రంలో న‌టించింది. అప్ప‌టి నుంచి స‌మంత నాగ‌చైత‌న్య ను ప్రేమించి పెళ్లి చేసుకొని తెలుగు కోడ‌లు అయ్యారు. పెండ్లి జ‌రిగి నాలుగో వార్షికోత్స‌వం జ‌రుపుకుంటార‌నుకున్న ఫ్యాన్స్‌కు వీరు షాక్ ఇచ్చారు విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించి. నాలుగు ఏండ్ల బంధానికి స్వ‌స్తీ ప‌లుకుతున్న‌ట్టు ఆమె సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. అంత‌కు ముందు నాగ‌చైత‌న్య విడాకుల‌పై అధికారికంగా ఎప్పుడైతే  స్పందించారో అప్ప‌టినుంచి ఆమెపై ర‌క‌ర‌కాల రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి.
 
నాగ‌చైత‌న్య‌తో విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించాక ఆమె సినిమాకు సంబంధించిన అప్‌డేట్  ఇప్ప‌టివ‌ర‌కు ఇవ్వ‌లేదు.  ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన శాకుంత‌లం చిత్రానికి సంబంధించిన పెద్ద అప్‌డేట్ రానున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు స‌మంత న‌టి న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తితో క‌లిసి న‌టించిన చిత్రానికి అప్‌డేట్ ఇవ్వ‌నుంది. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వ‌నుంది.

ద‌క్షిణ‌భార‌త‌దేశ సిని ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌ల‌లో స‌మంత ఒక‌రుగా మెలుగుతున్నారు. సోష‌ల్‌మీడియాలో ప్లాట్‌ఫాంలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ. త‌న అభిరుచుల‌ను త‌రుచూ షూర్ చేసుకుంటూ అభిమానుల‌తో పంచుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో మొద‌టిస్థానంలో ఉన్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను వెన‌క్కి నెట్టేసి స‌మంత నెంబ‌ర్‌వ‌న్ స్థానంలో కొన‌సాగుతోంది.

ఇటీవ‌ల ఆమె ఆర్మాక్స్ మీడియా చేప‌ట్టిన స‌ర్వేలో మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్ లిస్టులో స‌మంత నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ద‌క్కించుకుంది. ఆత‌రువాత స్థానంలో కాజ‌ల్‌, అనుష్క‌, ర‌ష్మిక‌లు ఉన్నారు. స‌మంత తొలిస్థానాన్ని ద‌క్కించుకోవ‌డం శుభ‌ప‌రిణామ‌మే. ఆ స్థానం అనేది ఎంత‌కాలం పాటు కొన‌సాగుతుందో వేచి చూడాలి మ‌రి. స‌మంత అమ‌లాపాల్‌లాగా దూకూడు పెంచ‌నున్న‌ట్టు ప్ర‌చారం కొన‌సాగుతోంది. ఏమి జ‌రుగుతుంద‌నేది కొద్ది కాలం పాటు వేచి చూడ‌క త‌ప్ప‌దు.



మరింత సమాచారం తెలుసుకోండి: