ఈ సారి దసరా కానుకగా "మహాసముద్రం" థియేటర్ లో విడుదలయింది. దర్శకుడు ప్రేమకథను సరికొత్తగా చూపించడంలో సిద్ధహస్తుడు కావడంతో ఈ సినిమాపై అటు మాస్ ఇటు లవ్ ను బాగా ఇష్టపడే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు. అందుకే సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేశారు. ఈ రోజు ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. అసలు ఈ సినిమా టైటిల్ కు కథకు సంబంధం లేదంటున్నారు కొంతమంది ప్రేక్షకులు. ఈ సినిమా టైటిల్ మాత్రం "మహాసముద్రం" అంటే డైరెక్టర్ అర్ధం ప్రకారం కొలవలేనంత ప్రేమ అని, అయితే సినిమాలో అసలు ప్రేమ అనేది అర్ధవంతంగా లేదనేది చాలా మంది ఫీలింగ్.

దర్శకుడు తన మొదటి సినిమాలో చూపినంత క్లారిటీ, స్క్రీన్ ప్లే ఇందులో కొరవడ్డాయని చెప్పవచ్చు. ఈ సినిమా ఒక విధంగా యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేదు, అలాగని ప్రేమికులను నచ్చదు. ఏదో ఫ్లో లో తీసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎమోషన్స్ ను ఘాడంగా చూపించడంలో విఫలం అయ్యాడని క్లియర్ గా తెలుస్తోంది. అయితే ఇందులో విలన్ గా చేసిన గరుడ రామ్ పెద్దగా కట్టుకోలేదు. విలన్ ఎంట్రీ కూడా గొప్పగా లేదు అనే చెప్పాలి.

ఏదో శర్వానంద్ ను డాన్ గా చేయడానికి గరుడ రామ్ పాత్ర ఉన్నట్లు ఉంది. ఈ సినిమా ట్రైలర్ ను చూపెట్టి ప్రేక్షకులకు మస్కా కొట్టాడు. వాస్తవంగా సినిమాలో అంతగా ఏమీ లేదు. మొదటి సినిమా ఇచ్చిన విజయాన్ని కంటిన్యూ చేయడంలో అజయ్ భూపతి ఫెయిల్ అయ్యాడు. ఈ సినిమా సిద్దార్ధ్ కు ఉపయోగపడుతుంది అనుకున్నాడు కానీ ఇందులో ఏ మాయా లేదు. కానీ ప్రస్తుతానికి పాజిటివ్ టాక్ అయితే లేదు. దసరా కాబట్టి ఏమైనా కలెక్షన్ ల పరంగా దూకుడు చూపిస్తుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: