తెలుగులోకి చాలా కాలం తర్వాత డైరెక్ట్ సినిమాతో సిద్దార్ధ అడుగుపెడుతుండటంతో మహా సముద్రం సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అసలు సిద్దార్ధ ఎలా డైరెక్టర్ అజయ్ భూపతి చూపించారో తెలుసుకోవాలని చాలామంది థియేటర్స్ లో టికెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే ఈ సినిమా ఈరోజు ఘనంగా తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయ్యింది.

గత రెండు మూడు సినిమాలనుంచి శర్వానంద్ కి సరైన హిట్ లేదు. ఆయన ఆకలి ఈ సినిమాతో అన్న తీరుతుంది అని శర్వా అభిమానులు చాలా ఎదురుచూస్తున్నారు. ఇక మహా సముద్రం సినిమాకి ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం సినిమాలో వచ్చే సెకండ్ హాఫ్ పెద్ద మైనస్ గా చూసిన ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. అసలు మొదటిభాగం సినిమాని స్మూత్ గా తీసుకెళ్లిన డైరెక్టర్ కి రెండో భాగంలో సరైన క్లారిటీ లేకపోవడం వలన పాత్రలు అన్నిటికీ న్యాయం చేయలేకపోయాడు అని టాక్. ప్రి రిలీజ్ ఫంక్షన్ లో ఈ సినిమా ట్రెండ్ సెట్ చేస్తుంది అని పెద్ద పెద్ద మాటలు చెప్పిన నటులు దర్శకులు ఈ సినిమా చూసిన వారికి మాత్రం అలా సినిమా ఎక్కడ అనిపించలేదు అని అంటున్నారు.

 ఆర్ ఎక్స్ 100 సినిమా లాగా ఇది కూడా డైరెక్టర్ అజయ్ భూపతి ఒక రేంజ్ లో దర్శకత్వం చేసి ఉంటాడు అనుకునేవాళ్ళకి మహా సముద్రం కొంచెం నిరాశ పరిచింది అనే చెప్పాలి. ఇక హీరోయిన్ గా చేసిన అను ఎమ్మానుఎల్ అసలు సినిమాలో ఎందుకు ఉందొ ఎవరికీ అర్థం అవ్వలేదు అని టాక్. ఇక ఈ సినిమాకి ప్రస్తుతనికి అయితే ఆవేరేజ్ అనే టాక్ నడుస్తుంది.అయితే ఈ వారం అంత హాలిడేస్ ఉండటంతో ఈ సినిమా మెల్లగా పికప్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి . అయితే ఎన్నో అంచనాలు పెట్టుకున్న వాళ్ళు మాత్రం మహా సముద్రం చూసి నిరాశపడ్డారు అని మాత్రం సోషల్ మీడియా లో ఎక్కువగా వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: