ఒకప్పుడు తెలుగు ఫామిలీ యంగ్ హీరోగా ఒక రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకున్న హీరో సిద్దార్ద్. ఆయన సినిమాలు రిలీజ్ అంటే యూత్ నుంచి ఫామిలీ ఆడియన్స్ దాకా అందరూ థియేటర్స్ దగ్గర క్యూలు కట్టేవాళ్ళు. బొమ్మరిల్లు , నువ్వొస్తాను అంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఆయన తెలుగులో టాప్ హీరోగా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే సిద్దార్ధ కి తెలుగులో కథలు అన్ని ఒకేలాగా రావడం ,ఆయన ప్రేమ కథలు హిట్ అవుతున్నాయి కాబట్టి సిద్దు కి అందరూ ప్రేమ కథలే వినిపించడంతో సిద్దు తెలుగులో సినిమాలు చేయడమే ఆపేశారు. దాదాపుగా 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ తెలుగులో ఒక మాస్ సినిమాతో సిద్దు ఎంట్రీ ఇచ్చాడు అదే మహా సముద్రం. ట్రైలర్ విడుదల చేసినప్పటినుంచి ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈరోజే విడుదలైన మహా సముద్రం సినిమా సిద్దు కి ప్లస్ అయ్యిందా లేదా మైనస్ అయ్యిందా అనేది ఇప్పుడు అందరిలోనూ ప్రశ్న. ఈ సినిమాకి ఇప్పటిదకా వచ్చిన టాక్ ప్రకారం చూస్తుంటే సిద్దు నటన చాలా బాగుంది అనే చాలామంది అంటున్నారు. సెకండ్ హాఫ్ లో అంత విలనిజం చాలబాగా పండిచాడు అని సిద్దు కి ప్రశంసలు వస్తున్నాయి.

 అయితే సినిమా విజయం మీదనే ఇప్పుడు అందరి కన్ను పడింది. ఎందుకంటే ఈ సినిమా కనుక హిట్ అయితే తెలుగులో మనం ఇంకా ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలు చూడొచ్చు. అయితే మహా సముద్రం టాక్ మాత్రం అంత గొప్పగా లేదు అని చెప్పాలి. డైరెక్టర్ కి క్లారిటీ లేకుండా సెకండ్ హాఫ్ లో సినిమాని చెడగొట్టాడు అని రివ్యూస్ వస్తున్నాయి. అయితే శర్వా సిద్ధుల నటన మాత్రం ఈ సినిమాకి హైలెట్ గా అనుకుంటున్నారు. ఆ లెక్కన ఈ సినిమా సిద్దు కి ప్లస్ అయ్యింది అనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: