నందమూరి బాలక్రిష్ణ మంచి ఆకలి మీద ఉన్నారు. ఆయనకు గత నాలుగేళ్ళుగా సరైన హిట్ లేదు అని చెప్పాలి. అదే టైమ్ లో ఆయన చేసిన బిగ్ ప్రాజెక్టులు కూడా బాక్సాఫీస్ దగ్గర దెబ్బ తిన్నాయి.

ఈ నేపధ్యంలో బాలయ్య కసి మీద చేసిన సినిమా అఖండ. పైగా దీనికి డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆయన పక్కా ఊర‌ మాస్ డైరెక్టర్. ఈ ఇద్దరి కాంబోకు కూడా ప్రత్యేకమైన విలువ, మర్యాద ఉంది. ఈ ఇద్దరు కలసి చేసిన సింహా, లెజెండ్ మూవీస్ సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ముచ్చటగా మూడవ సినిమాగా వస్తున్న ఈ మూవీ నిజంగా బ్లాక్ బస్టర్ అవాల్సిందే. లెక్కలు అన్నీ అలాగే ఉన్నాయి.

అయితే ఎన్ని అనుకూల అంశాలు ఉన్నా రిలీజ్ డేట్ కూడా చాలా ఇంపార్టంట్. బాలయ్యకు బాగా కలసి వచ్చేవి సంక్రాంతి, దసరా ఫెస్టివల్స్. గతంలో ఆయన హిట్లు కూడా ఈ సీజన్ లో  ఎన్నో ఉన్నాయి. నిజానికి అఖండ మూవీని మొదట దసరాకు తీసుకురావాలని అనుకున్నారు. అయితే థియేటర్ ఆక్యుపెన్సీ విషయంలో ఏమీ తేలకపోవడం, ఆన్ లైన్ టికెటింగ్ విధానం వంటి వాటి మీద కాస్తా ఆలోచించి వెనక్కి వెళ్ళారని అంటున్నారు.   ఇక ఈ మూవీ కోసం బాగానే ఖర్చు చేశారు అన్న టాక్ ఉంది.

దాంతో వసూళ్ళు భారీగా రావాలి అంటే కచ్చితంగా సరైన టైమ్ చూసుకోవాలి. అయితే ఏపీ సర్కార్ ఇపుడు గుడ్ న్యూస్ చెప్పింది. అది కూడా దసరాకు ఒక రోజు ముందే ఆ వార్త వినిపించింది. అదేంటి అంటే సెంట్ పెర్సెంట్ ఆక్యుపేషన్. దాంతో బాలయ్య ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. దసరాకు అఖండ మూవీ రావాల్సింది అని. నిజంగా దసరాకు బాలయ్య మూవీ వస్తే పోటీగా మరో పెద్ద సినిమా కూడా లేదు. దాంతో సూపర్ డూపర్ హిట్ అయ్యేది అన్న అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ఇపుడు మిగిలి ఉంది దీపావళి సీజన్ మాత్రమే. అది కనుక మిస్ అయితే డిసెంబర్ కి వెళ్లాలి. క్రిస్మస్ ముందు పుష్ప వస్తోంది. దానికి ముందు అంటే అన్ సీజన్. దాంతో అఖండ  మేకర్స్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: