అక్కినేని అఖిల్. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున రెండవ కుమారుడు. అందగాడు, డైనమిక్ హీరో. దూకుడు చాలానే ఉంది. అయినా సరైన హిట్ మాత్రం ఎక్కడా ఇప్పటిదాకా పడలేదు. మరి అఖిల్ లో ఏమైనా లోపం ఉందా లేదు. ఆయన శక్తిని అంతా పెట్టి ప్రతీ సినిమాకు సెంట్ పెర్సెంట్ ఇస్తున్నాడు.

అయితే అన్నీ ఉన్నా లక్ కలసిరావాలి అంటారు. అదే అఖిల్ విషయంలో జరుగుతోంది అంటున్నారు. అయితే ఇపుడు అఖిల్ కి ఆ లక్ ఫేవర్ చేస్తోంది అంటున్నారు. లేకపోతే దసరా లాంటి పెద్ద పండుగకు పెద్ద సినిమా ఒక్కటీ లేకపోవడం ఏంటి. అదే సమయంలో చిన్న సినిమాల్లో కూడా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్ కి అయిన బిజినెస్ దేనికీ కాకపోవడం ఏంటి. ఇక ఈ మూవీ మీద ఉన్న అంచనాలు చూస్తూంటే హిట్ కాదు, బ్లాక్ బస్టర్ అవడం గ్యారంటీ అంటున్నారు.

మరో వైపు ఏపీ సర్కార్ సెంట్ పెర్సెంట్ థియేటర్లలో ఆక్యుపెన్సీని కూడా పెంచి శుభం చెప్పేసింది. ఈ టైమ్ లో వస్తున్న ఈ బ్యాచ‌లర్ మీద అందరి ఆశలూ ఉన్నాయి. అప్పుడెపుడో ఉప్పెన‌తో వైష్ణవ్ తేజ్ వంద కోట్ల కలెక్షన్లు తెచ్చి దుమ్ము దులిపేశాడు. ఇపుడు కూడా అలాంటి మ్యాజిక్ అఖిల్ సాధిస్తాడు అంటున్నారు. ఇక ఈ మూవీలో లక్కీ గర్ల్ పూజా హెగ్డే ఉంది. ఆ అమ్మడు అల వైకుంఠ పురంలో మూవీ తరువాత ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో కచ్చితంగా వేసుకుంటుంది అంటున్నారు. ఇక దసరా లాంటి ఫెస్టివల్ కి సరైన ఫీస్ట్ ఈ బ్యాచలర్ అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే ఈ మూవీ మాత్రం అఖిల్ కి నిండా కరవు తీర్చేస్తుంది అని ఈ పండుగ నుంచి అన్నీ ఆయన కెరీర్ కి పండుగలే అని అక్కినేని ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ధీమాగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: