అందాల ముద్దుగుమ్మ అతిధి రావు హైదరీ తమిళ సినిమా శ్రీన్ గారమ్ తో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ సుధీర్ బాబు హీరోగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సమ్మోహనం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో అదితి రావు హైదరి నటనకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్పులు పడడంతో ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు అంతరిక్షం, వి వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఇలా తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సినిమాల్లో నటించిన అదితి రావు హైదరి ప్రస్తుతం శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ ఎక్స్ 100 ఫెమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహా సముద్రం సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అను ఇమాన్యుయల్ కూడా ఒక హీరోయిన్ గా నటించింది.

మహా సముద్రం సినిమా లో అదితి రావు హైదరి పాత్ర చాలా ముఖ్యమని ఈ పాత్ర చుట్టూనే కథ అంతా తిరుగుతుంది అని చిత్ర బృందం గత కొన్ని రోజులుగా చెపుతూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న అదితి రావు హైదరి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఇది మాత్రం కాకుండా అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ అదితి రావు హైదరి కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది. అయితే తాజాగా కూడా అదితి రావు హైదరీ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో అదితి రావు హైదరి ఎరుపు రంగు స్లీవ్ లెస్ డ్రెస్ ను ధరించింది. అదితి రావు హైదరి కి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: