టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి గురించి అతని దర్శకత్వంలో వచ్చిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అందరికి తెలుసు.. బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వం లో రాబోతున్న మరొక చిత్రం ఆర్ఆర్ఆర్ ఎన్నో అంచనాలతో రాబోతుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ అయిన ఆలియా భట్ అలాగే మోడల్ ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారని తెలుస్తుంది. అజయ్ దేవ్ గన్ మరియు శ్రీయ, సముద్రకని కీలక పాత్రల్లో నటించనున్నారని సమాచారం.అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు ప్రేక్ష కుల గురించి భారీగానే స్పందన వచ్చిందని తెలుస్తుంది.

అంతేకాకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది.. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్ర బృందం ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 7న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారని అధికారికంగా ప్రకటించారు.ఇది ఇలా ఉంటే ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన కొమరం భీమ్ మరియు అల్లూరి సీతారామరాజు పాత్రలకు సంబంధించి వేర్వేరు స్పెషల్ వీడియోస్ విడుదల చేసిన చిత్ర బృందం త్వరలోనే ఈ టీజర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోందని సమాచారం.

అస్సలు లేటెస్ట్ విషయం ఏమిటంటే ఈ సినిమా టీజర్ను దీపావళి సందర్భంగా అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. దీనిని జక్కన్న స్థాయి విజువల్స్ తో రెడీ చేస్తున్నారని వార్త వినిపిస్తుంది. ఇక ప్రచారంలో నిజానిజాలు తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందేనని తెలుస్తుంది. అయితే ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు చిత్ర బృందం కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: