అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది పూజ హీరోయిన్ కాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. మరి ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను చూడటానికి గల ఐదు ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అక్కినేని అఖిల్ తీసిన సినిమా లలో తొలిసారి ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రం లో నటించాడు.  అంతకుముందు లవర్ బాయ్ గా కొన్ని సినిమా లు, మాస్ కమర్షియల్ సినిమాను చేశాడు అఖిల్.

కానీ ఈసారి కుటుంబ విలువలతో కూడిన సినిమాను నమ్ముకున్నాడు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ గానే అంచనాలు పెట్టుకున్నాడు. అలాగే టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ అనగానే కొన్ని విమర్శలు వచ్చాయి.  అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర చూశాక ఇది ఆమె మాత్రమే చేయగల పాత్ర అని అనిపించింది ప్రతి ఒక్కరికి.

ఆ పాత్ర అంత వెరైటీ గా ఉంది కాబట్టే ఇప్పుడు ఈమెకు అంత మంచి పేరు వచ్చింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా చూడడానికి మరొక కారణం గీతా ఆర్ట్స్ సంస్థ ఎన్నో భారీ భారీ చిత్రాలను నిర్మించి సూపర్ సక్సెస్ లను అందుకున్న ఈ సంస్థ నుంచి వచ్చే సినిమాలు బాగానే ఉంటాయని ప్రతి ఒక్కరు భావిస్తుంటారు. ఆ విధంగా ఇప్పుడు తీసిన ఈ సినిమా కూడా వారి గత సినిమాల స్థాయిలోనే ఉంటుంది. అలాగే తెలుగు సినిమా పరిశ్రమలో మూడవ పెద్ద సంగీత దర్శకుడిగా ఎదగడానికి పోటీలో ఉన్నాడు సంగీత దర్శకుడు గోపి సుందర్. ఆయన పాటలు ఎంత తియ్యగా ఉంటాయో నేపథ్య సంగీతం కూడా అంతే మధురంగా ఉంటుంది. అలాంటి సంగీత దర్శకుడి నుంచి వచ్చిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే సూపర్ హిట్ కాగా పాటలు సినిమాలు ఎలా ఉంటాయో ఆసక్తి నీ కూడా పెంచాయి. ఈ కారణాలు చాలవా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా చూడడానికి. 

మరింత సమాచారం తెలుసుకోండి: