సినిమా పరిశ్రమలో అందరూ కలిసికట్టుగా ఉంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా పనులు చేస్తూ ప్రేక్షకులను ఆనంద పరిచే సినిమాలు చేస్తూ ఉంటే ఆ పరిశ్రమ వర్ధిల్లు తుంది అని సినీ పెద్దలు చెప్పటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎలాంటి విపత్కర పరిస్థితులు టాలీవుడ్ సినిమా పరిశ్రమకు వస్తాయో అన్న భయం అందరిలో నెలకొంది. హీరోల మధ్య విభేదాలు నటీనటుల మధ్య అభిప్రాయభేదాలు ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. మా అసోసియేషన్ ఎలక్షన్స్ సందర్భంగా జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే.

అధ్యక్ష పదవి కోసం రెండు వర్గాలు కొట్టుకోవడం తిట్టుకునే స్థాయిలో విమర్శించుకోవడం వంటివి తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తు ఏమైపోతుందో అన్న భయాన్ని కలిగించింది. ఎన్నికల తర్వాత అయినా ఆ విమర్శలు తగ్గుతాయో అందరూ కలిసికట్టుగా పని చేస్తరో అని అనుకున్నారు కానీ ఇంకా రాజీనామాల, విమర్శల పర్వం కొనసాగుతూనే ఉండడంతో అందరూ ఎంతో ఆందోళన చెందారు. దానికితోడు నందమూరి బాలకృష్ణ కూడా మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన అభ్యర్థని కాకుండా వేరొక అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో మళ్ళీ మెగా నందమూరి ఫ్యామిలీ ల మధ్య విభేదాలు బయటకు వచ్చాయి.

వీరి మధ్య విభేదాలు ఇంకా తగ్గలేదు అని అందుకే ఇద్దరూ చెరో అభ్యర్థిని బలపరిచారు అని అందరూ అనుకున్నారు. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ నందమూరి బాలకృష్ణ మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్న ఆహా యాప్ లో టాక్ షో చేయడానికి ఒప్పుకోవడం ఇప్పుడు తెలుగునాట సంచలనం సృష్టిస్తుంది.  ఈ నేపథ్యంలో త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ కలిసి ఓ షో చేయడం కూడా జరుగుతుంది అని చెప్పవచ్చు. మరి వీరి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ షో టిఆర్పి రేటింగ్ ను ఏ రేంజ్ లో అందుకుంటుందో అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా దీన్ని చూడటానికి చూస్తున్నారు. ఏదేమైనా ఇది ఓ మంచి పరిణామం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aha