రాజకీయాన్ని సినిమాను కలిపి ఎప్పుడు చూడకూడదు అంటూ ఉంటారు కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ రెండు కలిపితేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. కొంతమంది సినిమా వారు రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా కొంతమంది సినిమాలో ఉన్నారు ఈ రెండిటినీ కలిపి వారు తమ ఎదుగుదలను పెంచుకోవడం కొంత ఆసక్తి కరమైన విషయమని చెప్పవచ్చు.అలా సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ తన సత్తా చాటాలని భావిస్తున్నాడు.

అయితే రాజకీయాలలో ఘోర పరాభవం తో వెనుదిరిగి పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటున్నాడు. రాజకీయపరమైన పనుల్లో కూడా చూసుకుంటున్నారు. అయితే ఈ మధ్య రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనం సృష్టించాయి అందరికీ తెలిసిందే. అధికార ప్రభుత్వం ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన విమర్శలు సీఎం జగన్ దాకా వెళ్లాయి. దాంతో పవన్ కళ్యాణ్ పై వైసీపీ అభిమానులు వైసీపీ కార్యకర్తలు వైసిపి నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సినిమా పరిశ్రమలోని ఇబ్బందులకు అడ్డు వస్తే ఎవరైనా క్షమించను అని తీవ్ర స్థాయిలో పవన్ వార్నింగ్ ఇచ్చారు.

అయితే ఈ పరిణామం వైసిపి వారికి నచ్చకపోయినా ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా టిడిపి వారికి మాత్రం ఎంతగానో నచ్చుతుంది. వారి దృష్టిలో పవన్ కళ్యాణ్ కూడా తమ నాయకుడు అయిపోతాడు అని అనుకున్నారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే టిడిపి నాయకుడు సినిమా నటుడు అయిన బాలకృష్ణ మెగా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ స్థాపించిన ఆహా యాప్ లో చేయడానికి ఒప్పుకోవడం చూస్తుంటే రిపబ్లిక్ సినిమా ఎఫెక్టు వల్లనే ఆయన ఈ షో చేయడానికి ఒప్పుకున్నాడు అని అనిపించక మానదు. మరి అంతకు ముందే షో చేయాలని బాలయ్య డిసైడ్ అయ్యడా లేదా రిపబ్లిక్ స్పీచ్ లో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన పవన్ కళ్యాణ్ ను మచ్చిక చేసుకోవడానికి చంద్రబాబు చేసిన అస్త్రమే బాలకృష్ణ షో చేయదానికి కారణమా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: