ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతుంది పూజా హెగ్డే. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ వరుస విజయాలను ఖాతాలో వేసుకుని దూసుకుపోతుంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పూజా హెగ్డే కెరీర్ పీక్ స్టేజిలో ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాలతో తన అందం అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది ఈ ముద్దుగుమ్మ. అదే సమయంలో అందాల ఆరబోత చేసి ఎంతో మంది యువతను పగటి కలల్లోకి నెట్టింది.  తన అందం అభినయంతో దర్శక నిర్మాతలను కూడా ఆకర్షిస్తూ వరుస అవకాశాలు అందుకుంటోంది.



 ఒకప్పుడు ఐరన్ లెగ్ హీరోయిన్ గా కొనసాగిన పూజా.. ఇప్పుడు మాత్రం.. ఏకంగా ఎంతో మంది డైరెక్టర్లకు హీరోలకు లక్కీ ఛార్మ్ గా మారిపోయింది.  ఇకపోతే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాల్లో దాదాపు గా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది అనే విషయం తెలిసిందే. అదే సమయంలో బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలు అందుకుంటూ అక్కడ బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది ఈ ముద్దుగుమ్మ.  అయితే హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా పూజా హెగ్డే నటిస్తుంది అన్న విషయం తెలిసిందే.



 భవదీయుడు భగత్ సింగ్ అనే ఒక డిఫరెంట్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా సెన్సేషనల్ హిట్ కొట్టింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో భారీగానే అంచనాలు ఉన్నాయి. కాగా  ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయిందని ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో పాత్ర గురించి మాట్లాడిన పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలో తన రోల్ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నట్లు పూజా హెగ్డే తెలిపింది. అయితే గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన దువ్వాడ జగన్నాథం, గద్దల కొండ గణేష్ సినిమాలో పూజా హెగ్డే నటించిన ఈ రెండు సినిమాల్లో కూడా పూజా హెగ్డే ను ఎంతో అందంగా చూపించాడు దర్శకుడు హరీష్ శంకర్.

మరింత సమాచారం తెలుసుకోండి: