అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ సినిమా స్టార్ట్ అయ్యింది. ఎన్నో అవాంత రాలు దాటుకుని రెండున్న రేళ్ల త‌ర్వాత ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అక్కినేని హీరో.. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీ లోకి వ‌చ్చి ఆరు సంవ‌త్స‌రాలు అయ్యింది.. ఒక్క హిట్ కూడా లేదు.. ఈ సినిమాతో అయినా ఎలాగైనా హిట్ కొడ‌తాడ‌న్న అంచ‌నాలు.. మ‌రో వైపు గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌.. ఇవ‌న్నీ కూడా ఈ మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ సినిమాను ఎంత మాత్రం గ‌ట్టెక్కించ లేక‌పోయాయి.

ఈ రోజు ద‌స‌రా సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా టైటిల్స్ నుంచే చాలా రొటీన్ గా స్టార్ట్ అవుతుంది. టైటిల్స్ లోనే పెళ్లి , పెటాకుల మీద గీసిన కార్టూన్ల తో టైటిల్స్ వేస్తారు. ఇవి చాలా రొటీన్ గా ఉండ‌డంతో పాటు మ‌న చిన్న‌ప్పుడు కార్టూన్ల‌ను గుర్తుకు తెచ్చాయి. విచిత్రం ఏంటంటే సినిమా లో ఓ సీన్లో పూజా చెప్పే జోకులు ప్రేక్ష‌కుల‌కు అర్థం కావు.. వాళ్లు బుర్ర గొక్కుంటూ ఉంటారు. అయితే ఎలాగూ ప్రేక్ష‌కులు న‌వ్వ‌ర‌ని ఏమో గాని సినిమా లో స్టాండ‌ప్ ప్రేక్ష‌కుల‌ను సెట్ చేసి వారితో న‌వ్విస్తూ ఉంటారు.

ఈ సీన్ చూస్తోన్న ప్రేక్ష‌కుడికి తాము ఎక్క‌డ ఉన్నామో కూడా ? అర్థం కాని దుస్థితి ఎదుర వుతుంది. అస‌లు గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్లో వ‌చ్చే సినిమాల్లో కంటెంట్ ను ఒక‌టి కి ప‌ది సార్లు చూసి కాచి వ‌డ పోసిన త‌ర్వాత గాని ఓకే చేయ‌రు. మ‌రి ఈ సినిమా క‌థ‌ను ఎలా ?  ఓకే చేశారో కూడా ఎవ్వ‌రికి అర్థం కాదు. ఇక పెళ్లికూతుళ్లతో నడిపిన కోర్టు సీన్ - గుడిలో పూజా - ప్రగతి, అఖిల్ మధ్యన జరిగే సీన్లు చూస్తుంటే అస‌లు బొమ్మ‌రి ల్లు సినిమా తీసింది భాస్క‌రేనా.. లేదా అప్పుట్లో ఎవ‌రైనా త‌న ద‌గ్గ‌ర ఉన్న మంచి అసిస్టెంట్ల తో ఈ సినిమా తీయించి త‌న పేరు వేయించుకున్నాడా ? అన్న సందేహాలు రాక మాన‌వు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: