ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ ఫుల్ జోష్ లో ఉన్నాడు అని చెప్పవచ్చు. ఇప్పటికే రవితేజ ఈ సంవత్సరం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన క్రాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇలా ట్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు కూడా విపరీతంగా పెంచాయి.ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే రవితేజ ఖిలాడి సినిమా తో పాటు శరత్ మండువా దర్శకత్వం లో తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్ర లో కనిపించబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ లకు జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజా గా దసరా సందర్భంగా రామారావు ఆన్ డ్యూటీ చిత్ర బృందం మరొ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ పోస్టర్ ద్వారా రామారావు ఆన్ డ్యూటీ చిత్ర బృందం ప్రేక్షకుల కు దసరా శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సినిమాలో దివ్యాంషా కౌశిక్, రాజేషా విజయన్, వేణు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. మరి ఈ రెండు సినిమాలతో రవితేజ ఇలాంటి విషయాలను బాక్సాఫీస్ వద్ద అందుకున్నాడో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: