అందాల ముద్దు గుమ్మ నభా నటేష్ సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ ముద్దు గుమ్మకు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత  రవితేజ హీరోగా తెరకెక్కిన డిస్కో రాజా సినిమా తో మరొక సారి తన అదృష్టాన్ని బాక్సాఫీస్ దగ్గర నభా నటేష్ పరీక్షించుకుంది, కానీ ఈ సినిమా కూడా ఆశించిన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ముద్దు గుమ్మకు తెచ్చి పెట్టలేదు. కాకపోతే డిస్కో రాజా సినిమా లో ఈ ముద్దుగుమ్మ అందచందాలతో, నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.

ఆ తర్వాత రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన నభా నటేష్ కు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని తెచ్చి పెట్టింది, ఇలా ఈస్మార్ట్ శంకర్ సినిమా విజయంతో నభా నటేష్ కు తెలుగు నాట మంచి సినిమా ఆఫర్లు వచ్చాయి. అందులో భాగంగా సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన నభా నటేష్ కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తన అభిమానులతో టచ్ లో ఉంటుంది, అలాగే హాట్ బ్యూటీ నాభా నటేష్ అప్పుడప్పుడు తన అంద చందాలతో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ కూడా ఉంటుంది. అయితే తాజాగా కూడా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో నభా నటేష్ పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో నభా నటేష్ సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని ఆ చీర కు సరిపోయే బ్లౌజ్ ధరించి ఉంది. ప్రస్తుతం నభా నటేష్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: