అఖిల్ అక్కినేని.. ఈయన సిసింద్రీ సినిమాతో బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అఖిల్ ఆ తర్వాత అఖిల్, మజ్ను, హలో లాంటి సినిమాలలో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.. అంతేకాదు నాగార్జున సాధించిన విజయాలలాగే.. ఆయన తనయుడు అఖిల్ ఏ మాత్రం విజయాన్ని అందుకోలేక పోయారు. అంతేకాదు నాగార్జున పెద్దకొడుకు నాగ చైతన్య కూడా మొన్నటివరకూ పెద్దగా సక్సెస్ ని పొందలేకపోయాడు అన్న విషయం తెలిసిందే.. ఇకపోతే అఖిల్ అక్కినేని ఒక్కసారైనా హిట్ కొడతాడు అని అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన రోజులు చాలానే ఉన్నాయి..


కానీ ఎట్టకేలకు పూజా హెగ్డే తో కలిసి తీసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా దసరా పండుగ సందర్భంగా విడుదల అయ్యి, అందరి అంచనాలను ఒక్కసారిగా తారుమారు చేసింది.. అంతేకాదు ప్రేక్షకుల స్పందన కూడా ఈ సినిమాపై చాలా బాగా వచ్చిందని కూడా చెప్పాలి.. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన నటించిన పూజాహెగ్డే అఖిల్ సరసన నటించడంతో సినిమాకు హైలెట్ గా నిలిచింది.. ఈ సినిమా అత్యంత విజయాన్ని అందుకుంది అనే చెప్పవచ్చు. మొదటి సినిమాతోనే మంచి హిట్ టాక్ ను అందుకుంది ఈ సినిమా.. ఇక అక్కినేని అభిమానులు మాత్రం ఎట్టకేలకు మంచి విజయాన్ని అఖిల్ సాధించాడు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


నిజానికి బొమ్మరిల్లు భాస్కర్ ఏ సినిమాకు  దర్శకత్వం వహించినా ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అన్న విషయం తెలిసిందే.. అలాగే అక్కినేని అఖిల్ తీసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది అని చెప్పవచ్చు. రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి జిఏ2  పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు అలాగే వాసు వర్మ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది.
 కానీ కొవిడ్ 19  కారణంగా అనేక సార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు 2021 అక్టోబర్ 15వ తేదీన విడుదల చేశారు.

ఇకపోతే ఈ సినిమాలో నటీనటుల పాత్రల కోసం సుమారుగా 100 మందిని ఆడిషన్స్  జరుపగా, ఎట్టకేలకు 2019 ఆగస్టులో ఈషా రెబ్బ అలాగే పూజా హెగ్డే లను ఖరారు చేశారు. ఈ సినిమాలో అక్కినేని అఖిల్ ఒక ఎన్ఆర్ఐ గా నటించగా , పూజా హెగ్డే స్టాండప్ కమెడియన్ గా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: