'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం నిన్న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ ఎమోషనల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ నడుస్తోంది. మొత్తానికి అఖిల్ హిట్ కొట్టినట్టే అంటున్నారు అక్కినేని అభిమానులు. విమర్శకులు సైతం సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. హిట్ సరే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా ? అంటే వీకెండ్ పూర్తయ్యే వరకూ వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా సినిమా మొత్తం ఎమోషన్స్ లవ్ తో నిండిపోగా నటీనటుల పనితీరు, టెక్నిషియన్ల పనితీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

అయితే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ద్వారా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఏం చెప్పాలనుకున్నాడు అంటే... గతం లో 'ఆరెంజ్' సినిమాతో ప్రేమ అనే కన్ఫ్యూజ్ అని చెప్పాడు. ఇప్పుడు ప్రేమకు, రొమాన్స్ కు మధ్య తేడా ఏంటో చూపించాడు. ఈ రెండింటి మధ్య సతమతమయ్యే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చివరి కి ప్రేమ ను ఎలా కనుక్కున్నాడనేది సినిమా. కానీ సినిమా చూసిన కొందరు మాత్రం బొమ్మరిల్లు, షాదీ ముబారక్ వంటి సినిమాల సమ్మేళంగా ఈ మూవీ ఉందని అంటున్నారు.

ఏదైతేనేం ప్రేక్షకుల కు నచ్చడమే చిత్రబృందం ప్రధానాంశం. మరి ప్రేక్షకులు ఈ సినిమా విషయంలో ఎలాంటి తీర్పును ఇస్తారో అనేది వేచి చూడాలి. సినిమా హిట్ అయ్యిందంటే గనుక అక్కినేని అఖిల్ కు, అలాగే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కు కలిసొచ్చే అంశం అవుతుంది. ఇంకా వీకెండ్ రెండ్రోజులు ఉంది కాబట్టి వసూళ్లు బాగానే రాబట్టే ఛాన్స్ ఉంది. శనివారం, ఆదివారం రెండ్రోజులు కూడా పండగ రోజు మూడ్ ఉంటుంది. పైగా వారాంతం కాబట్టి చూడాలి మరి సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయి? నిర్మాతల ను ఎలా గట్టెక్కిస్తారు ? అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: