టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ సినిమాలు అనగానే అభిమానుల్లో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. బాలకృష్ణ సినిమా విడుదల అవుతుంది అంటే చాలు  అభిమానులు పండగ చేసుకుంటారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రయూనిట్ సిద్ధమైంది ఈ సినిమా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నారు ఏంటనే దానిపై చాలా వరకు అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో ఎటువంటి స్పష్టత రావడం లేదు. ఈ సినిమా టైటిల్ కు సంబంధించి బాలకృష్ణ ఆలోచన మరోలా ఉందని కాస్త భిన్నంగా పెట్టేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఈ సినిమా టైటిల్ ని తన పేరు గా పెట్టే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నారని 'బాలకృష్ణ' అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి బాలకృష్ణ కుమారుడు ఒక సలహా ఇచ్చారని ఆయన సలహా మేరకు ఈ సినిమా టైటిల్ ఉండే అవకాశాలు కూడా ఉండవచ్చని టాలీవుడ్ జనాల మాట.

సినిమా తర్వాత బాలకృష్ణ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే అవకాశం ఉందని ఆ సినిమాను త్వరలోనే ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాకు గుమ్మడి కాయ కొట్టిన వెంటనే ఆ సినిమాకు కొబ్బరికాయ కొట్టేందుకు రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఆ సినిమాను అత్యంత వేగంగా పూర్తి చేసి  వచ్చే ఏడాది దసరాకు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారని ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే బాలకృష్ణ స్పీడ్ మాత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: