'పెళ్లి సందD' చిత్రం అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమాలు అంటేనే పండ్లు, పువ్వులు, అలాగే బంధువులతో ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది. అలాగే ప్రేమ, రొమాన్స్ తో పాటు అన్ని అంశాలూ కలగలిపి ఉంటాయి. ఈ చిత్రంలో కూడా అలాగే ఉన్నాయి. స్క్రీన్ మొత్తం అందంగా కలర్ ఫుల్ గా అట్ట్రాక్టీవ్ గా కన్పించింది. హీరో హీరోయిన్లు రోషన్, శ్రీలీలతో పాటు సీనియర్ నటీనటులంతా బాగా నటించారు. ఇక పాటలు చెప్పక్కర్లేదు. దర్శకత్వ బాధ్యతలు లేడీ డైరెక్టర్ గౌరి చేపట్టినప్పటికీ పర్యవేక్షణ మాత్రం రాఘవేంద్ర రావుదే కాబట్టి ఆ మార్క్ స్పష్టంగా కన్పించింది.

ఇదిలా ఉంటే అప్పట్లో 'పెళ్లి సందడి"తో శ్రీకాంత్ హీరో గా నిలదొక్కుకున్నాడు. ఆ సినిమా శ్రీకాంత్ కు స్టార్ స్టేటస్ ను ఇచ్చి ఆయన కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ తరువాత శ్రీకాంత్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మరిప్పుడు అదే టైటిల్ తో వస్తున్న ఆయన కొడుకు రోషన్ ను కూడా శ్రీకాంత్ లాగే ఇండస్ట్రీలో హీరో గా ''పెళ్లి సందD' నిలబెడుతుందా ? అంటే... రాఘవేంద్ర రావు సినిమా ఇండస్ట్రీ కి ఎంతోమంది హీరో హీరోయిన్ల ను పరిచయం చేశారు. దాదాపుగా వారంతా ఇండస్ట్రీలో స్టార్లు గానే కొనసాగారు. పైగా ఈ సినిమా తో రోషన్ ను హీరో గా నిలబెడతానని రాఘవేంద్ర రావు శపథం చేశారు.

ఆయన అన్నట్టుగానే కొత్తవారైనప్పటికీ హీరోహీరోయిన్ల దగ్గర నుంచి మంచి నటనను రాబట్టుకోగలిగారు. రోషన్ డ్యాన్స్, నటన ఆకట్టుకున్నాయి. ఇక శ్రీలీల సైతం తన అభినయం, అందంతో కళ్ళు తిప్పుకోనివ్వలేదు. డ్యాన్స్ లోనూ ఏమాత్రం తీసిపోలేదు. కాబట్టి ఆమె కూడా ఫ్యూచర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి నెక్స్ట్ వీరికి టాలీవుడ్ లో అవకాశాలు ఎలా ఉంటాయన్నదే ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: