టాలీవుడ్ లో ఇప్పుడు అనుష్క చేయబోయే సినిమాల విషయంలో కాస్త ఆసక్తికర చర్చలు మనం చూస్తూనే ఉంటాం. అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనే దానిపై టాలీవుడ్ వర్గాలు కూడా చాలా ఆసక్తికరంగా ఈ మధ్యకాలంలో చర్చించుకుంటున్నాయి. అనుష్క ప్రస్తుతం రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరిగింది కానీ ఆమె మాత్రం సినిమా విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదని త్వరలోనే ఆమె వివాహం చేసుకునే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క పెళ్లి చూపుల్లో ఉందని త్వరలోనే ఆమె పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని అంటున్నారు.

అయితే ఇప్పుడు అనుష్క కి సంబంధించిన ఒక వార్త టాలీవుడ్ లో బాగా హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం అనుష్క సినిమాలకు దూరంగా ఉన్నా సరే ఆమెను ఇటీవల ఒక ప్రముఖ నిర్మాత సంప్రదించారని సమాచారం. హీరో నానీచేయబోయే ఒక సినిమాలో ఆమె దానికి తల్లి పాత్రలో నటించే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. ఈ సినిమాలో నటనకు ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని త్వరలోనే ఈ సినిమాలో అనుష్క లుక్ కూడా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

ప్రస్తుతం అనుష్క బాలీవుడ్ లో ఏదో ఒక సినిమాలో నటించే అవకాశం ఉందనే ప్రచారం అలాగే మలయాళంలో కూడా దుల్కర్ సల్మాన్ కు తల్లి పాత్రలో నటించే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరిగింది. ప్రస్తుతం అనుష్క ముంబై లోనే ఎక్కువగా ఉంటుందని కూడా సమాచారం. అనుష్క కెరీర్ విషయంలో ఆలోచన మారిందని ఇక నుంచి ఆమెకు హీరోయిన్ గా ఏదైనా పాత్ర పోషించే అవకాశం వచ్చినా సరే ఆ పాత్రను కాదని ఆమె కేవలం అక్క లేదా అత్త లేదా వయసుకు తగిన పాత్రలు మాత్రమే చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: