గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో హీరో నాని ఎక్కువగా ఇబ్బందులు పడటం మనం చూస్తూనే ఉన్నాం. హీరో నాని విషయంలో కొంతమంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించిన నాని మాత్రం హిట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం నాని కెరీర్ కు కాస్త ఇబ్బందికర పరిస్థితులు లోనే ఉంది అనే కామెంట్స్ కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా నాని సినిమాల విషయంలో కాస్త భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం కూడా ఈ మధ్యకాలంలో ఇబ్బంది పెడుతోంది. ఒకప్పుడు అతని సినిమాల కోసం ఎదురు చూసిన అభిమానులు ఇప్పుడు సినిమాలను పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు.

అయితే ఇప్పుడు నాని కి అండగా నిలబడే అవకాశం ఉందని రానా, నాని ఇద్దరు కూడా మంచి స్నేహితులు కావడంతో... నాని కెరీర్ ని గాడిలో పెట్టేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. నాని గత కొంతకాలంగా రానా తో చర్చలు జరుపుతున్నాడని ఒక యాక్షన్ సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆ సినిమాలో నాని సోదరుడిగా రానా నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించే అవకాశం ఉండొచ్చు అని కూడా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు మరి.

అయితే ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే మరో కీలక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని ఈ సినిమాను సురేష్ బాబు తో కలిసి మరో నిర్మాత కూడా నిర్మించే అవకాశం ఉండవచ్చని అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం రానా రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో కాస్త గట్టిగా ప్రయత్నం చేస్తే మాత్రం కచ్చితంగా నాని కెరీర్  గాడిలో పడే అవకాశం ఉందని అందుకే రానా కూడా ఈ సినిమా విషయంలో చాలా సీరియస్ గా ఉండి కథను మార్పులు చేస్తున్నాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: