తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ లో హీరోగా రాణించ‌డానికి అక్కినేని అఖిల్ చాలా క‌ష్ట ప‌డుతున్నాడు. అక్కినేని వార‌స‌త్వం తో ఇండ‌స్ట్రీ లోకి వ‌చ్చినా మంచి హీరోగా మాత్రం రాణించ‌డం లేదు. అఖిల్ త‌న మొద‌టి సినిమా ను టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ వీవీ విన‌య‌క్ ద‌ర్వ‌క‌త్వం వ‌హించాడు. కానీ ఈ సినిమా అశించిన స్థాయిలో రాణిచ‌లేదు. దీంతో త‌న మొద‌టి సినిమా తోనే అఖిల్ కు ప‌ర‌జ‌యం త‌ప్ప‌లేదు. దీని త‌ర్వ‌త కొన్ని సినిమా లు తీసినా.. అవి కూడా అశించిన న మేర ఆడ‌లేవు. కానీ హాలో అనే సినిమా తో కాస్త హిట్ అందుకున్నాడు. దీని త‌ర్వాత మిస్ట‌ర్ మ‌జ్ను కూడా పెద్ద‌గా ఆడ‌లేదు. దీంతో అక్కినేని వారస‌త్వం కొన‌సాగ‌లంటే త‌ప్ప‌ని స‌రిగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తీశారు.



గ‌తంలో లాగే ల‌వ్ స్టోరీ ఉన్న క‌థ నే ఎంచుకున్నాడు. కాని ఈ ప్రేమ క‌థ కు కాస్త కొత్త ద‌నాన్ని జోడించారు. ఆ కొత్త ద‌న‌మే ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా కు ప్ల‌స్ గా మారింది అని చెప్పాలి. ఈ సినిమా లో హ‌ర్ష పాత్ర లో అక్కినేని అఖిల్ ఒదిగి పోయాడు. అలాగే విభావ‌రి పాత్ర లో పూజా హెగ్డే త‌న మార్క్ న‌ట‌న చూపించింది. ఈ సినిమా కు అఖిల్, పూజా హెగ్డే  ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క అవుట్ అయింది.  వీరి మ‌ధ్య కెమస్ట్రీ సినిమా కే హైలైట్ గా ఉంది. అలాగే ఈ సినిమా కు గోపీ సుంద‌ర్ అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది. అలాగే పాట‌లు కూడా ఈ సినిమా కు ప్ల‌స్. అలాగే ఫ‌స్ట్ ఆఫ్ సినిమా కు అద‌న‌పు బ‌లాన్ని అందించింది. దీంతో పాటు ఫ‌స్ట్ ఆఫ్ అద్భతుంగా చూపించిన డైరెక్ట‌ర్.. కానీ సెంక‌డ్ ఆఫ్ మాత్రం అంచ‌నాలను అందు కోలేక పోతుంది. చివ‌ర‌కి అక్క‌నేని అఖిల్ కు ఒక మంచి హిట్ అందుకున్న‌ట్టే అని చెప్పాలి. ఈ సినిమా తో అఖిల్ కు వ‌రుస గా అవ‌కాశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.






మరింత సమాచారం తెలుసుకోండి: