హ్యాపీ డేస్ సినిమా తో హీరోగా పరిచయం అయిన నిఖిల్ ఈ సినిమాతో ఎంతో మంది తెలుగు యువత మనసు దోచుకున్నాడు. హ్యాపీ డేస్ సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నిఖిల్ కు తెలుగు నాట ఆఫర్లు కూడా బాగానే దక్కాయి. అందులో భాగంగా అనేక సినిమాలలో హీరోగా నటించిన నిఖిల్ కు ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను తెచ్చి పెట్టలేదు. అలా వరుస పరాజయాలతో హీరోగా వెనుకబడిన సమయంలో నిఖిల్ కు, సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన స్వామి రారా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం తెచ్చిపెట్టింది. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో  తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకుల నుండి కూడా మంచి ప్రశంసలు దక్కాయి.

అలా స్వామిరారా సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్న నిఖిల్ ఆ తర్వాత  ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ వంటి సినిమాల్లో నటించి తెలుగు మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత స్వామి రారా సినిమాతో తనకు ఎంతో మంచి విజయాన్ని అందించిన సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ మరోసారి కేశవ అనే సినిమాలో హీరోగా నటించాడు. కాకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే తాజా గా మరొక సారి సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించడానికి రెడీ అయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది హైడ్రిక్ సినిమా. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యాన ర్ మీద BVSN ప్రసాద్మూవీ నిర్మించనున్నారు. నవంబర్ 1 నుండి ఈ మూవీ ప్రారంభం కానుంది. ఈ మూవీ కోసం 40 రోజుల పాటు లండన్ లో షెడ్యూ ల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నిఖిల్ 18 పేజీస్, కార్తికేయ 2 సినిమా లో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: