ఫీల్ గుడ్ సినిమాలతో ప్రేక్షకులను ఇప్పటివరకు మెప్పిస్తూ దర్శకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇటీవలే అక్కినేని నాగచైతన్య తో ఆయన చేసిన లవ్ స్టోరీ చిత్రం సూపర్ హిట్ అయింది. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్ లు కొట్టగా ఒక్కసారి గా క్రేజీ దర్శకుడు గా శేఖర్ కమ్ముల నిలిచాడు.  ఆ సినిమా తర్వాత ధనుష్ తో ఆయన సినిమా అనౌన్స్ చేయడం ఒకసారి వా ఆయనను స్టార్ డైరెక్టర్ ను చేసింది అని చెప్పవచ్చు.

తాజాగా శేఖర్ కమ్ముల లీడర్ 2 చిత్రాన్ని పవన్ కళ్యాన్ తో చేసే ఆలోచనలో ఉండడంతో శేఖర్ కమ్ముల ధనుష్ సినిమా ఏమైంది అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు కొంతమంది అభిమానులు. లవ్ స్టోరీ చిత్రం విడుదల కాకముందే శేఖర్ కమ్ముల అధికారికంగా ప్రకటన చేశాడు.  ఒప్పుకున్న కమిట్ మెంట్లు పూర్తయిన తర్వాత ధనుష్ శేఖర్ సినిమా ను మొదలుపెడతాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.  

అయితే తాజాగా ఆయన సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకోవడం ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఇంకా పూర్తి కాకపోవడంతో అలాగే శేఖర్ కమ్ముల పవన్ కళ్యాణ్ లీడర్2 సినిమాలు చేయడం వంటివి చూస్తుంటే ఈ సినిమా పట్టాలెక్కుతుందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించిన వార్తలను ఏ విధంగా చిత్ర బృందం కొట్టిపారేస్తుందో చూడాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ శేఖర్ కమ్ముల చిత్రం ఎంతో ఇంట్రెస్ట్ ను కలిగించే సినిమా అని చెప్పొచ్చు. పవన్ పొలిటికల్ కెరీర్ కోసం ఈ సినిమా వినియోగించుకోవాలని చూస్తున్నాడట. లీడర్ సినిమా రానా కి ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో తెలిసిందే.. ఇటు రానా, అటు ధనుష్ ను కాదని శేఖర్ చేస్తున్న ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: