తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కామెడీ సినిమాలతో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నట కిరీటి రాజేంద్రప్రసాద్ గారు.కామెడీకి హీరోయిజంతో పాటు స్టార్ స్టేటస్ ని అందించిన నటుడు రాజేంద్రప్రసాద్.ఒకవైపు కామెడీ సినిమాలు చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను మెప్పించారు.ఇక ఆయన సినిమాలు చూసి కడుపుబ్బా నవ్వుతూ సమస్యలను కాసేపు మర్చిపోయే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఈ విషయాన్ని తెలుగు తేజం,అప్పటి ప్రధాన మంత్రి అయిన పీవీ నరసింహారావు స్వయంగా వెల్లడించారు.

ఆయన ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం పలు రాజకీయ సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితుల్లో రాజేంద్రప్రసాద్ సినిమాలను చూసేవారట నరసింహారావు గారు.ఇక ఇదిలా ఉండగా వయసు పై పడటం,కొత్త తరం నటీ నటుల రాకతో ఇక రాజేంద్రప్రసాద్ పనైపోయిందని అందరూ అనుకున్నారు.కానీ అలాంటి సమయంలో 'ఆ నలుగురు' సినిమాతో కొత్త చరిత్ర సృష్టించాడు.ఇక ఇప్పటికీ కామెడీకి ఫాదర్ గా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున,బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు తెలుగు తెరను దున్నేస్తున్న సమయంలో వాళ్లందరికీ తన సినిమాలతో గట్టి పోటీ ఇచ్చాడు రాజేంద్రప్రసాద్.

ఇక హాలీవుడ్ సినిమాల్లో సైతం నటించిన అతికొద్ది మంది దక్షిణాది నటుల్లో రాజేంద్రప్రసాద్ కూడా ఒకరు.క్విక్ గన్ మురుగన్ గా ఆయన ఆడియన్స్ ని ఎంతగానో మెప్పించారు.అయితే ఈ సినిమా కోసం రాజేంద్రప్రసాద్ తన కెరీర్లోనే అత్యధిక పారితోషకాన్ని అందుకున్నారు.అది ఎంత అంటే సుమారు 35 లక్షల రూపాయలు.ఇదే ఆయన తన కెరీర్లో అందుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్.దీన్ని బట్టి ఆయనకు స్టార్ డమ్ ఉన్న రోజుల్లో కూడా ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేయలేదని అర్ధమవుతుంది.అదే ఇప్పటి తరం నటులు అయితే ఓ రెండు సినిమాలు హిట్ అయితే.. తమ రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేస్తారు. కానీ రాజేంద్రప్రసాద్ గారు మాత్రం అలా చేయలేదు.బహుశా అందుకే ఆయన్ని గొప్ప నటుడని అంటారేమో...!!

మరింత సమాచారం తెలుసుకోండి: