తెలుగు ఇండస్ట్రీలో దర్శకేంద్రుడిగా పేరొందిన రాఘవేంద్రరావుకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎంతోమంది అగ్ర హీరోలకి వరుస సూపర్ హిట్స్ అందించిన ఆయన..మొదటిసారి నటుడిగా మారి కెమెరా ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన తాజా చిత్రం 'పెళ్లి సందD' సినిమాలో రాఘవేంద్రరావు గారు కీలక పాత్రలో నటిస్తున్నారు.అయితే ఈ సినిమా కంటే ముందే ఓ రెండు సినిమాల్లో సూపర్ హిట్ పాత్రలని వదులుకున్నారు రాఘవేంద్రరావు.ఆయన నటించాల్సిన తొలి సినిమా 'పెళ్లి సందD' కాదు.దీని కంటే ముందు ఆయన్ని ఓ రెండు సినిమాల్లో నటించమని అడిగితే..నో చెప్పేసారట.

విక్టరీ వెంకటేష్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'ఘర్షణ' సినిమాలో కీలక పాత్ర కోసం రరాఘవేంద్రరావు గారిని ఆడిగారట.ఎందుకో కానీ,ఆ సినిమా చేయను అని ఆయన చెప్పేసారట.ఇక ఆ తర్వాత శర్వానంద్ నటించిన 'శతమానంభవతి' సినిమాలో ప్రకాష్ రాజ్ పోషించిన పాత్ర కోసం తొలుత రాఘవేంద్రరావు గారినే సంప్రదించారట.ఆ సినిమాలో కొడుకులు నిర్లక్ష్యం చేసే తండ్రి పాత్ర అది.అందుకే చేయను అని చెప్పేసా..నిజ జీవితంలో నాకూ,మా పిల్లలకీ మంచి అనుబంధం ఉంది.దానికి తోడు ఆ పాత్ర చాలా బరువైనది.మొదటి సారే అంత బరువైన పాత్ర చేయడం కష్టమని...సినిమా చేయనని చెప్పేసా...

మాములుగా ఊరెళ్లినప్పుడు స్నేహితులతో కలిసి సరదాగా మేమే స్క్రిప్ట్ రాసుకొని,నటించి సెల్ ఫోన్స్ లో షూట్ చేస్తూ ఉంటాం.అవి మా పిల్లలకు చూపించినప్పుడు..మీరు సినిమాల్లో నటించొచ్చు కదా అని అనేవారు..అయితే మళ్ళీ ఇన్నాళ్లకు 'పెళ్లి సందD' లో నటిస్తున్నా అని అన్నారు రాఘవేంద్రరావు.ఇక పెళ్లి సందD సినిమాలో సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక అతని సరసన శ్రీలీల హీరోయిన్ గా పరిచయం అవుతోంది. గౌరీ రోనాంకి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఎమ్. ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఇక దసరా కానుకగా విడుదలైన ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: