రాజకీయాల కు కొంత బ్రేక్ ఇచ్చి ఇప్పుడు వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు పవన్ కళ్యాణ్. ఆయన హీరో గా నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తర్వాత మూడు సినిమాలను లైన్లో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రాన్ని దాదాపు పూర్తి చేసే స్థాయికి తీసుకు వచ్చాడు పవన్.  త్వరలోనే హరీష్ శంకర్ దర్శకత్వం లోని భవదీయుడు భగవద్గీత మరియు సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ని సినిమాను కూడా మొదలు పెట్ట నున్నాడు.

ఇలా వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ఇవే కాకుండా మరికొన్ని సినిమాలను కూడా చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నాడు.  ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ సినిమాతో ఘనవిజయం అందుకున్న దర్శకుడు దేవకట్టా తో ఆయన ఓ సినిమా చేస్తున్నాడు అని ప్రచారం జరిగుతుంది. అలాగే లవ్ స్టోరీ చిత్రంతో సక్సెస్ అందుకున్న శేఖర్ కమ్ముల తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. 

 అయితే మరింత మంది దర్శకులతో సినిమాలు ఒప్పుకుంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తుండగా వాటికి డేట్లు ఎలా అడ్జస్ట్ చేస్తాడో అన్న అనుమానాన్ని సినిమా విశ్లేషకులు వ్యక్త పరుస్తున్నారు.  ఇప్పటి వరకు ఒప్పుకున్న సినిమాల కు డేట్లు 2023 కి అయిపోతాయి. ఆ తర్వాత ఎలక్షన్స్ బిజీ లో ఉంటాడు. మరి శేఖర్ కమ్ముల చిత్రాన్ని ఎలా చేస్తాడో చూడాలి. ఇంకో వైపు అనిల్ రావిపూడి కూడా పవన్ తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.  దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం వెంకటేష్ వరుణ్ తేజ్ లతో కలిసి ఆయన  సినిమా చేస్తుండ గా ఈ చిత్రం చివరి దశకు వచ్చింది సంక్రాంతికి విడుదల కాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: