యంగ్ రెబ‌ల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా సినిమా ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తు బిజీ గా ఉన్నాడు. ఇప్ప‌టికే రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్ అనే సినిమా అలాగే ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో సలార్, అలాగే ఓ రౌత్ ద‌ర్శ‌క‌త్వంతో ఆదిపురుష్, తో పాటు ప్రాజెక్ట్ కె సినిమా లకు సంబంధించిన షూటింగ్ ల‌లో పాల్గొంటు బిజీ బిజీ గా ఉంటున్నాడు. దీనికి తోడు ఇటీవ‌ల మ‌రో సినిమా కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా సూప‌ర్ కాప్ క‌థ కు ప్ర‌భాస్ ఓకే చెప్పాడు. దీనికి సంబంధించి స్పిరిట్ ఇటీవల టైటిల్ ను ప్ర‌క‌టించారు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం తీస్తున్న సినిమా లో పాటు సందీప్ రెడ్డి వంగా కాంబినేష‌న్ లో వ‌స్తున్న స్పిరిట్ కూడా పాన్ ఇండియా లెవ‌ల్ సినిమా కావ‌డం విశేషం.



అయితే ఈ సినిమా కు సంబంధించి ఒక ముఖ్య‌మైన అప్ డేట్ వ‌చ్చిందంటు సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అవుతుంది. ఈ సూప‌ర్ కాప్ సినిమా లో ప్ర‌భాస్ కు విలాన్ గా బాలీవుడ్ బ్యూటీ ఫుల్ హీరోయిన్ న‌టిస్తోంద‌ని సోషల్ మీడియా లో ఈ వార్త చెక్క‌ర్లు కొడుతుంది. ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవ‌రో కాదు క‌రీన క‌పూర్ అని తెలుస్తోంది.  అయితే దీనిపై చిత్ర యూనిట్ గానీ క‌రీనా కపూర్ గానీ ఇంత వ‌ర‌కు అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. అయితే ఈ సినిమా క‌థ ను మ‌లుపు  త‌ప్పే ఒక ప‌వుర్ ఫుల్ పాత్ర లో క‌రీనా క‌పూర్ క‌నిపిస్తుంద‌ని టాక్. మొద‌టి ఈ క‌థ ను క‌రీనా క‌పూర్ కు చెప్పిన‌ప్పుడు వెంట‌నే ఒప్పు కుంద‌ని స‌మాచారం. అయితే ఈ విల‌న్ పాత్ర కు క‌రీనా క‌పూర్ భారీ గా రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటుందని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ స్పిరిట్ సినిమా రెగ్యూల‌ర్‌ షూటింగ్ ప్రారంభ కానుంది అని స‌మాచారం. ఈ సినిమాను  2023  సంవ‌త్స‌రంలో విడుదల చేయాల‌ని భావిస్తున్నార‌ట‌.





మరింత సమాచారం తెలుసుకోండి: