ఇటీవల కాలంలో పెద్ద పెద్ద హీరోలు, సెలబ్రిటీలు అందరూ కూడా ఓ టీ టీ లలో సినిమాలను చేస్తూ ఉన్నారు.  బాలీవుడ్ లో ఇప్పటికే ఈ సంప్రదాయం బాగా పెరిగిపోయింది. టాప్ సెలబ్రిటీలు అందరూ కూడా ఓ టీ టీ లలో సినిమాలను చేస్తూ సినిమా లలో చేస్తున్నట్లుగానే ఓ టీ టీ లలో వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాదికి కూడా ఈ సంప్రదాయం పాకింది. ఇప్పటికే చాలా మంది హీరోలు ఓ టీ టీ లో డైరెక్ట్ సినిమా చేస్తున్నారు. తమిళం లో ఇప్పటికే చాలా పెద్ద సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నారు.

హీరో సూర్య ఆయన చేసిన జై భీమ్ సినిమా ను ఓ టీ టీ కోసమే చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు.  ఇక తెలుగులో కూడా కొంతమంది హీరోలు ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వడం కోసం ఆలోచన చేస్తున్నారు. మరికొన్ని సినిమాలు  థియేటర్లో విడుదల చేద్దాం అనుకుని టైం కుదరక సినిమాలు ఇప్పటి వరకు చాలానే ఓ టీ టీ లో విడుదలయ్యాయి.  కానీ ఇప్పుడు చాలా సినిమాలు ఓ టీ టీ కోసం మాత్రమే రెడీ అవుతుండటం చూస్తుంటే కాలం మారింది అని చెప్పవచ్చు. తాజాగా అక్కినేని నాగార్జున ఓ వెబ్ సిరీస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.

 ప్రముఖ సంస్థలో వెబ్ సిరీస్ ఆయన చేసే ఆలోచన చేస్తున్నాడు.  ఇప్పుడు మరికొంత మంది హీరోలు వెబ్ సిరీస్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో  టాలీవుడ్ లో మెగాస్టార్ గా పేరున్న చిరంజీవిని కూడా ఓ టీ టీ కోసం రంగంలోకి దించాలని ఓ అగ్ర సంస్థ ప్రయత్నాలు చేయగా ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది.  ఇప్పుడు ఇది తెలుగునాట హాట్ టాపిక్ గా మారింది. గతంలో కూడా ఓ సారి చిరంజీవిని ఓ టీ టీ కోసం సంప్రదించగా ఆయన సున్నితంగా తిరస్కరించాడు. ఇప్పుడు ఓ భారీ వెబ్ సిరీస్ కోసం ఆయనను సంప్రదించగా మళ్లీ రిజెక్ట్ చేశాడు అంటున్నారు. అలాగే ఆయన హీరోగా నటించిన ఆచార్య సినిమా కూడా ఓ టీ టీ ఇవ్వకపోవడం పట్ల ఆయనకు ఓ టి టి అంటే ఎందుకు అంత భయం అన్న విధంగా చర్చలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో మెగాస్టార్ ఓ టీ టీ కోసం పని చేస్తారో చూడాలి.  ఇప్పటికే వెంకటేష్ రానా లు కలిసి నెట్ ఫ్లిక్స్ లో భారీ వెబ్ సిరీస్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: