లవర్‌ బాయ్‌ లుక్స్‌తో లేడీ ఫాలోయింగ్‌ పెంచుకున్న కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌కీ దగ్గర కావాలనుకుంటున్నాడు. కుటుంబ కథా చిత్రాన్ని వెతుక్కుంటూ 'అలవైకుంఠపురములో' ఆగాడు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ బ్లాక్‌బస్టర్‌ని 'షెహజాదా'గా హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. రోహిత్ ధావన్‌ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్‌ లీడ్‌ రోల్స్‌లో వస్తోందీ సినిమా.

రాజ్‌కుమార్‌ రావుకి బాలీవుడ్‌లో న్యూ జనరేషన్‌ యాక్టర్‌గా సూపర్ క్రేజ్ ఉంది. ఎలాంటి క్యారెక్టర్ అయినా సొంత మార్క్‌ చూపించే రాజ్‌ కుమార్‌ ఇప్పుడు తెలుగు 'హిట్' రీమేక్‌కి సైన్ చేశాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్‌సేన్ హీరోగా వచ్చిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ని రీమేక్ చేస్తున్నాడు. భూషణ్‌ కుమార్‌తో కలిసి దిల్‌ రాజు నిర్మిస్తోన్న ఈ రీమేక్‌ని ఒరిజినల్‌ మూవీ డైరెక్టర్ శేలేష్‌ తెరకెక్కిస్తున్నాడు. షాహిద్ కపూర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ 'కభీర్ సింగ్'. ఈ బ్లాక్‌బస్టర్‌తోనే షాహిద్‌ సోలోగా వందకోట్ల క్లబ్‌లో అడుగుపెట్టాడు. 'అర్జున్‌రెడ్డి' రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో షాహిద్‌కి బోల్డన్ని ప్రశంసలు వచ్చాయి. ఇక ఈ జోష్‌లోనే 'జెర్సీ' సినిమాని రీమేక్‌ చేస్తున్నాడు. తెలుగు 'జెర్సీ' తీసిన గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలోనే తెరకెక్కుతోంది హిందీ 'జెర్సీ'.

అనిల్‌ రావిపూడి 'ఎఫ్2' సినిమా కూడా హిందీలో రీమేక్‌ అవుతోంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్‌గా వచ్చిన ఈ సినిమాని బోనీ కపూర్‌ రీమేక్‌ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. దిల్‌ రాజు సహనిర్మాతగా వ్యవహరిస్తాడని, బోనీ కపూర్ కొడుకు అర్జున్‌ కపూర్‌ ఒక హీరోగా నటిస్తాడని టాక్ వస్తోంది. ఇక ఇంతకుముందు అర్జున్‌ కపూర్‌ 'ఒక్కడు' సినిమాని 'తేవర్‌'గా రీమేక్‌ చేశాడు. బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌ పెట్టడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ డిమాండ్‌కి తగ్గట్లుగా కథలు దొరకట్లేదు. దీంతో ఎక్కడ మంచి కథలు ఉంటే అక్కడ లాండ్ అయిపోతున్నారు బాలీవుడ్‌ మేకర్స్. కంప్లీట్‌ మీల్‌లా ఉండే తెలుగు కథలని బీటౌన్‌కి తీసుకెళ్తున్నారు. అల్లరి నరేష్‌ని వరుస ఫ్లాపుల నుంచి బయటపడేసిన సినిమా 'నాంది'. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ కోర్టు డ్రామాని హిందీకి తీసుకెళ్తున్నాడు అజయ్ దేవగణ్. దిల్‌ రాజుతో కలిసి హిందీలో 'నాంది'ని రీమేక్ చేస్తున్నాడు అజయ్.





మరింత సమాచారం తెలుసుకోండి: