అక్కినేని అఖిల్ వెండితెరకి హీరోగా పరిచయం అయి చాలా కాలమే అవుతున్నా.. అతనికి బాక్సఫీస్ దగ్గర ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు.ఈ హీరో నటించిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.ఇక వరుస పరాజయాల తర్వాత అఖిల్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.గీతా ఆర్ట్స్2 బ్యానర్లో బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.ఇక దసరా కానుకగా విడుదల అయిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో అఖిల్ ఫ్యాన్స్ తన తర్వాత సినిమా ఏజెంట్ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.

ఇక ఇదిలా ఉండగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా అఖిల్ మాట్లాడుతూ..'అల్లు అరవింద్ గారు ఫోన్ చేసిన సమయంలో లవ్ స్టోరీ అని చెప్పగానే తాను నిరాశ చెందానని,అయితే కథ కొత్తగా అనిపించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చెప్పుకొచ్చాడు.బొమ్మరిల్లు భాస్కర్ కు హిట్లు లేవని తాను అనుకోలేదని..నేను కూడా బ్లాక్ బస్టర్స్ ఇచ్చి రాలేదు కదా అని కామెంట్స్ చేశారు అఖిల్.కేవలం కథను నమ్మే ఈ సినిమా తీశామని చెప్పుకొచ్చాడు అఖిల్.అంతేకాకుండా నాన్న గారికి ఈ కథ చెప్పగానే..ఆయన ఇచ్చిన చిన్న చిన్న సలహాలని తీసుకున్నానని అఖిల్ పేర్కొన్నాడు.

ఇక సినిమాలో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించే సమయంలో కొంత ఇబ్బంది పడ్డానని చెప్పిన అఖిల్..సినిమాలో కొన్ని  స్పైసీ డైలాగ్స్ ఉంటాయని..కానీ ఆ డైలాగ్స్ ప్రేక్షకులను పెద్దగా ఇబ్బంది పెట్టవని అఖిల్ పేర్కొన్నాడు.ఇక అల్లు అరవింద్ గారిని తాను ఓ గాడ్ ఫాదర్ లాగా భావిస్తానని.. అల్లు అరవింద్,బన్నీ వాసు అనుభవం ఈ సినిమాకు ఎంతో ఉపయోగపడిందని వెల్లడించాడు అఖిల్.ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత అఖిల్ నటిస్తున్న సినిమా 'ఏజెంట్'.సురేందర్ రెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.ఈ సినిమాలో అఖిల్ ఓ స్పై ఏజెంట్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల్లో భారీ స్పందన లభించింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: