"పెళ్లి సందడి" బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ బాగానే రాబడుతూ సందడి చేస్తోంది. గౌరీ రోనంకి రచన, దర్శకత్వంలో రూ[పిఎండిన ఈ సినిమాను శివ శక్తి దత్త, శ్రీధర్ సంయుక్తంగా నిర్మించారు. రొమాంటిక్ మూవీ "పెళ్లి సందడి" 15 అక్టోబర్ 2021 న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్లుగా ప్రధాన పాత్రలు పోషించారు. దసరా కానుకగా నిన్న విడుదలైన ఈ చిత్రంపై విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పెళ్లి సందడి చిత్రంతో నటప్రవేశం చేశారు. పైగా ఈ సినిమా ఆయన పర్యవేక్షణ లోనే తెరకెక్కింది. సాంగ్స్ కూడా వెండితెరపై అద్భుతంగా ఉండడంతో రాఘవేంద్ర రావు మార్క్ సినిమాలో కన్పించింది.

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం 'పెళ్లి సందడి' విడుదల రోజున రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లలో బాక్సాఫీస్ వద్ద రూ .1.54 కోట్ల షేర్లను సాధించింది.  విడుదలైన రోజున సినీ ప్రేమికులు, విమర్శకుల నుండి సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టడం విశేషం.  మరి ఈ వీకెండ్ ఈ సినిమా ఎన్ని కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.

ప్రాంతాల వారీగా 'పెళ్లి సందడి' చిత్రం కలెక్షన్లు :
నైజాం : రూ .51 లక్షలు
సీడెడ్ : రూ .34 లక్షలు
యూఏ : రూ .17 లక్షలు
ఈస్ట్ : రూ .9 లక్షలు
వెస్ట్ : రూ .8 లక్షలు
గుంటూరు : రూ .18 లక్షలు
కృష్ణ : రూ. 9లక్షలు
నెల్లూరు : రూ. 8
మొత్తం ఏపీ/టీఎస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు పెళ్లి సందడి రూ .1.54 కోట్లు (రూ. 2.65 కోట్లు)
మొత్తం ప్రపంచవ్యాప్త పెళ్లి సందడి మొదటి రోజు కలెక్షన్లు రూ. 1.61 కోట్లు (రూ. 2.80 కోట్లు)


మరింత సమాచారం తెలుసుకోండి: