మాస్ మహారాజా రవితేజ కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పెట్టుకున్నాడు. అలాంటి సమయంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇడియట్ సినిమా తో రవితేజ టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.  ఆ తర్వాత కూడా అనేక సినిమాలలో నటించిన రవితేజకు ఎక్కువగా మాస్ సినిమాలే గుర్తింపు తీసుకు వచ్చాయి. తాజాగా కూడా వరస పరాజయాలతో డీలా పడిపోయిన రవితేజకు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమా రవితేజకు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్ బస్టర్ ను అందించింది. ప్రస్తుతం కూడా రవితేజ క్రాక్ సినిమాతో అందుకున్న విజయాన్ని కంటిన్యూ చేయడానికి వరస మాస్ సినిమాల్లో నటిస్తూ ముందుకు దూసుకు పోతున్నాడు.

 రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి, ఈ సినిమా మంచి మాస్ అంశాలతో దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తో పాటు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో పాత్రలో కనిపించనున్నాడు, ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ ర్ లకు జనాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది, ఈ సినిమాను కూడా దర్శకుడు మంచి మాస్ అంశాలతో తెరకేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు మాస్ మహారాజ రవితేజ త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటిస్తున్నాడు, ఈ సినిమా పేరును దసరా సందర్భంగా విడుదల చేశారు, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించబోయే సినిమా పేరు ధమాకా. ఈ సినిమా కూడా మాస్ అంశాలతో తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా మాస్ మహారాజా రవితేజ వరుసబెట్టి మాస్ పవర్ ఫుల్ సినిమాలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: