2006లో మంచి ప్రేమ కథ నేపథ్యంతో విడుదలైన సినిమా బొమ్మరిల్లు అని అందరికి తెలుసు.. ఈ సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహించాడని తెలిసిన విషయమే ఈ సినిమాతో డైరెక్టర్ భాస్కర్ కు మంచి గుర్తింపు రావడంతో బొమ్మరిల్లు భాస్కర్ గా పేరు సంపాదించుకున్నాడని తెలుస్తుంది.


దిల్ రాజ్ నిర్వహణలో రూపొందిన ఈ సినిమాలో సిద్ధార్థ్ మరియు జెనీలియా నటీనటులుగా నటించి మెప్పించారు.


ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందని తెలుస్తుంది.. ఈ సినిమా కథ, పాటలు మరియు పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయని ఈ సినిమాకు కథను డైరెక్టర్ ఓ పుస్తకం నుంచి తీసుకున్నట్లు సమాచారం.ఈ సినిమాకు తొలిసారిగా తన దర్శకత్వంను పరిచయం చేశాడట భాస్కర్. కేవలం దర్శకుడిగానే కాకుండా రచయితగా మరియు నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడని తెలుస్తుంది 


ఇక బొమ్మరిల్లు సినిమాతో ఉత్తమ నూతన దర్శకుడు గా అవార్డు కూడా అందుకున్నాడని సమాచారం.. ఇక ఈ సినిమా విడుదలై మంచి విజయం అందుకున్న తర్వాత అప్పట్లో ఈ సినిమా గురించి ఒక కాంట్రవర్సీ బాగా నడిచిందని తెలుస్తోంది.. ఈ సినిమాకు కథను ఒక కథ పుస్తకం నుండి తీసుకున్నట్లు సమాచారం.. అది కూడా 'ఆమెలో ఏముంది' అనే బుక్ నుంచి డైరెక్టర్ భాస్కర్సినిమా కథను రూపొందించినట్లు సమాచారం.


దీంతో ఈ కథను రాసిన రైటర్ కూడా ఈ సినిమాపై కేసు వేసినట్లు గతంలో బాగా వార్తలు వినిపించాయని తెలుస్తుంది.. ఆ తర్వాత మళ్లీ ఈ విషయం గురించి ఎవరు మాట్లాడుకోకపోగా తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బొమ్మరిల్లు కథ గురించి హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తుంది.. ఇక బొమ్మరిల్లు సినిమా తర్వాత పరుగు సినిమాకు దర్శకత్వం వహించి ఈ సినిమాతో కూడా మంచి విజయం అందుకున్నాడు.

ఆ తర్వాత వరుసగా ఆరెంజ్ మరియు ఒంగోలు గిత్త సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని తెలుస్తుంది.. ఇక ఈ ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు దర్శకత్వం వహించాడని గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందగా తాజాగా ఈ సినిమా విడుదలైందని కానీ ఈ సినిమా అంతగా విజయం సాధించకపోగా కొంతవరకు మెప్పించిందని సమాచారం. ఇందులో అక్కినేని అఖిల్ మరియు పూజా హెగ్డే నటీనటులుగా నటించారని అందరికి తెలిసిన విషయమే..


ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కథ కాస్త ఆకట్టుకునే విధంగా లేదని ఎలా ప్రారంభం అయ్యిందో ఎలా ముగిసిందో అర్థం కాలేదని చాలామంది కామెంట్లలో తెలిపారని తెలుస్తుంది.. దీంతో తాజాగా ఈ సినిమా గురించి కూడా పలురకాల ప్రశ్నలు వేస్తున్నారట నెటిజన్లు. కొంతవరకు ఈ సినిమా కథ బొమ్మరిల్లు సినిమా కు సింక్ అయ్యేలా ఉందని టాక్ కూడా వచ్చిందట.నిజానికి ఈ సినిమా చాలా కన్ఫ్యూజన్ గా ఉందని పాత పద్ధతిలోనే ఈ సినిమాను రూపొందించాడని సమాచారం. ఈ సినిమాలో కొత్తదనం కనిపించలేదు అంటూ తీసిన సన్నివేశాలే మళ్లీ మళ్లీ ఉన్నట్లు అనిపించాయని నెటిజన్లు అంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: