సినీ పరిశ్రమలో కొత్త వారికి ఎవరో ఒకరు అవకాశాలిస్తేనే దర్శకుడిగానో, హీరోగానో మరియు మ్యూజిక్ డైరెక్టర్‌గానో విజయం సాధిస్తారు. అప్పుడే కొత్త టాలెంట్ అనేది సినీ పరిశ్రమకి వస్తుందని అందరికి తెలుసు.


ఇక వరుసగా ఫ్లాప్ సినిమాలు చేసిన దర్శకుడు కొంతకాలం వరకు పరిశ్రమలో కనిపించకపోతే సాధారణంగా ఆ దర్శకుడిని ఎవరూ పట్టించుకోరని అప్పటికే సినిమాలు చేసిన నిర్మాతలైనా లేదా హీరోలైనా మొహం చాటేస్తారని ఇలా జరిగి ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి ఎంతోమంది దర్శకులు దూరమయ్యారని తెలుస్తుంది.. అలాంటి ఓ డైరెక్టర్‌కి మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ లైఫ్ ఇవ్వబోతున్నారన్న విషయం అందరికి తెలిసిందే...


తమిళంలో పెద్ద విజయం సాధించిన వేదాళం రీమేక్ మెగాస్టార్ చేయబోతున్న వి విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో భోళా శంకర్‌గా రూపొందించబోతున్నారని తెలుస్తుంది.. ఇందులో హీరోయిన్‌గా తమన్నా మరియు మెగాస్టార్‌కి చెల్లిగా స్టార్ హీరోయిన్ అయిన కీర్తి సురేశ్ నటించబోతున్నారని తెలుస్తుంది.. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు ఓ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను ఎంచుకొని మెగాస్టార్ షాక్ ఇచ్చారని తెలుస్తుంది. గతంలో అగ్ర సంగీత దర్శకులతో పనిచేస్తున్న చిరు మణిశర్మకి సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చి గొప్ప లైఫ్ ఇచ్చారని అందరికి తెలుసు. సంగీత దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన

మెగాస్టార్ ఆ తర్వాత ఎన్నో సినిమాలకి సంగీత దర్శకుడిగా అవకాశం కల్పించారని తెలుస్తుంది..


ఇప్పుడు ఆయన తనయుడు అయిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగర్‌కు కూడా చిరు గోల్డెన్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది.. నిజంగా ఈ అవకాశం దక్కుతుందని మహతి ఎంతమాత్రం అనుకొని ఉండడని సమాచారం.ఇప్పటి వరకు మహతి సంగీతం అందించింది అన్ని మీడియం రేంజ్ సినిమాలేనని తెలుస్తుంది.అది కూడా నితిన్ మరియు నాగ శౌర్య లాంటి యంగ్ హీరోల సినిమాలకే పనిచేశాడని తెలుస్తుంది.. అలాంటి మహతికి మొట్టమొదటిసారి అవకాశం మెగాస్టార్ చిరు గొప్పతనం అని చెప్పవచ్చు.. ఇది చాలా మంది నమ్మలేకపోతున్నారని తెలుస్తుంది.ఆచార్య సినిమాతో మళ్ళీ మణిశర్మకి అవకాశం ఇచ్చారట మెగాస్టార్. గత కొంతకాలంగా మణిశర్మకి అవకాశాలివ్వలేదని తెలుస్తుంది 


 అలాంటిది ఒకేసారి అటు తండ్రి మరియు ఇటు కొడుకును ఎంకరేజ్ చేయడం నిజంగా ఆసక్తికరంగా మారిందని తెలుస్తుంది.. ఆచార్య సినిమాకి మణిశర్మ ను మరియు గాడ్ ఫాదర్ సినిమాకి థమన్ అలాగే భోళా శంకర్ సినిమాకి మహతి సంగీత దర్శకులని తెలుస్తుంది.. ఇంకో సినిమాను బాబి దర్శకత్వంలో చేయబోతున్నారట మెగాస్టార్. ఇంకా ఈ సినిమాకి సంగీత దర్శకుడిని ఎంచుకోవాల్సి ఉందని తెలుస్తుంది అయితే మెగాస్టార్ తలుచుకుంటే ఎం.ఎం.కీరవాణి మరియు ఏ.ఆర్.రెహమాన్ లాంటి వారు వచ్చి రెడీ అవుతారని తెలుస్తుంది. దర్శకుడు కావాలంటే రాజమౌళి వంటి వారు కాదనరని సమాచారం.


అలాంటిది ఎందుకు ఫేడవుట్ అయిన దర్శకుడితో అలాగే పట్టుమని పది సినిమాలకి కూడా సంగీతం అందించని చిన్న మ్యూజిక్ డైరెక్టర్‌కు అవకాశం ఇచ్చారనేది అందరికీ షాకింగ్‌గా అనిపిస్తోందని చెప్పవచ్చు.. అయితే మణిశర్మ కొడుకు కాబట్టి అవకాశం ఇచ్చినా ఆయన సపోర్ట్ గట్టిగా ఉంటుందనే కారణంతో మహతికి సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చి ఉంటారని తెలుస్తుంది.ఇక మెగాస్టార్‌కి మెహర్ రమేశ్ దగ్గరి బంధువని అదీకాక కరోనా సమయంలో మెగాస్టార్ తలపెట్టిన సహాయక చర్యల కోసం బాగా కష్టపడ్డాడని ఆ సమయంలో చాలా కథలు చిరుతో చర్చించాడని తెలుస్తుంది.అతని కసి పట్టుదల చూసి మెగాస్టార్ అవకాశం ఇచ్చినట్టు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: