ద‌స‌రా పండుగతో మా ఊళ్లో వాన‌. మా ఊళ్లో అంటే శ్రీ‌కాకుళం అని అర్థం. వ‌రుస వాన‌లు కూడా! బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ సినిమా అప్పుడే వ‌చ్చింది. సినిమాకు జ‌నం బాగానే వెళ్లారు. హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఏపీ స‌ర్కారు వంద శాతం ఆక్యుపెన్సీ కి థియేట‌ర్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో బాగానే పోయారు. ఎక్క‌డా కోవిడ్ నిబంధ‌న‌ల పాటింపు అయితే లేనే లేదు. అంతేకాదు క‌నీసం శానిటైజ‌ర్ బాటిల్ ను కూడా దిల్ రాజు థియేట‌ర్ అందుబాటులో ఉంచ‌లేదు. థ‌ర్మ‌ల్ చెక్ లేనే లేదు. ఇదీ మా ఊరి థియేట‌ర్ ఎస్వీసీ లోని ప‌రిస్థితి. ఇది మిన‌హాయిస్తే సినిమా బాగుంది. ఫీల్ గుడ్ ఫ్యాక్ట‌ర్స్ ఉన్నాయి. స్కిన్ షో ఉన్నా కూడా ఎబ్బెట్టుగా లేదు. ఆన్ స్క్రీన్ రొమాన్స్ కూడా అంత ఎబ్బెట్టుగా లేదు. ద‌స‌రా పండుగ కార‌ణం నాగార్జున కు ఉన్న టెన్ష‌న్లు అన్నీ పోయాయి. మ‌రికొన్ని మంచి సినిమాలు అఖిల్ చేయొచ్చు.



 స్టోరీ బేస్డ్ సినిమాల‌కు స‌రిపోతాడు. ల‌వ్ స్టోరీలే చేయొచ్చు. యాక్ష‌న్ కు స‌రిపోడులే అప్పుడే! క‌నుక మాస్, ఊర‌మాస్ లాంటి ప‌దాల‌పై అంద‌రిలానే ప్రేమ పెంచుకోక క‌థా బ‌లం ఉన్న సినిమా సూత్రాల‌కు ఆయ‌న స‌రిపోతాడు. ఇక అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. లేత వ‌య‌సు పిల్లాడు క‌దా అలానే ఉంటాడు.న‌ట‌న‌కు సంబంధించి ఇంకా నేర్చుకోవాలి. పాట‌లు ప‌ర్లేదు. లెహ‌రాయితోనే మంచి టాక్ ఉంది. మిగ‌తా పాట‌లు ప‌ర్లేదు.అయ్య‌గారు మొత్తానికి హిట్టు కొట్టారు. క‌లెక్ష‌న్లు కొల్ల కొడ‌తారో లేదో అన్న‌ది తెలియ‌దు. ఆ లెక్క‌లు నిజాయితీగా బ‌న్నీ వాసు చెప్పాలి.


మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ని అంటూ అఖిల్ ఈ ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు త‌న‌ని తాను ప‌రిచ‌యం చేసుకునే ప్ర‌య త్నం ఒక‌టి చేశాడు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా అఖిల్ గ‌త సినిమాల క‌న్నా బాగుంది. ముఖ్యంగా సినిమాకు పాజిటివ్ బ‌జ్ రావ‌డంతో క‌లెక్ష‌న్లు బాగున్నాయి. వీకెండ్ లో నిల‌బ‌డే సినిమా కూడా ఇదే కానుంది. దీంతో ప్రొడ్యూస‌ర్లు బ‌న్నీ వాసు, వాసూ వ‌ర్మ, అల్లూ అర‌వింద్ పండుగ చేసుకోవ‌చ్చు. పెర్ఫార్మెన్స్ ప‌రంగా అఖిల్ గ‌తం క‌న్నా బెట‌ర్ అయ్యాడు. డైలాగ్ డెలివ‌రీ ఓకే.. మంచి మాట‌లు చాలానే ఉన్నాయి. డైలాగ్స్ రాసినా లేదా రాయించిన విధానం చాలా అంటే చాలా బాగున్నాయి. సినిమా బొమ్మ‌రిల్లు, ఆరెంజ్ ను క‌లుపుకుని ఉంటుంది. అయినా స‌రే బాగుంది.



విడుద‌ల‌యిన మ‌హా స‌ముద్రం కంటే, విడుద‌ల‌యిన పెళ్లిసంద‌డి కంటే బాగుంది. డైరెక్ట‌ర్ న‌డిపిన సినిమా ఇది. ఇంకాస్త మెచ్యూర్డ్ యాక్టింగ్ కోరుకోవ‌డంలో త‌ప్పు లేదు. అక్కినేని న‌ట‌వార‌సుడు అందుకు త‌గిన విధంగా ప్రిపేర్ కావాలి. చాలా రోజుల నుంచి దాహంతో ఉన్న అఖిల్ కు కాస్త ఉప‌శ‌మ‌నం. అలా అని ఆయ‌నేం  క‌ష్ట‌ప‌డ‌లేదు అని కాదు. కానీ ఈ సినిమా గ‌తం  క‌న్నా బెట‌ర్ గా ఉంది. అలా అని ద బెస్ట్ మూవీ అన్న స‌ర్టిఫికేట్ యాక్టింగ్ ప‌రంగా ఇవ్వ‌లేం.

మరింత సమాచారం తెలుసుకోండి: