ఈసారి దసరా సీజన్లో మూడు సినిమాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయని తెలుస్తుంది.. మూడింట్లో దేనికీ ప్రేక్షకుల నుంచి పూర్తి సానుకూల స్పందన లేదని తెలుస్తుంది.. ఐతే పెళ్ళి సందడి మరీ పేలవంగా ఉండటంతో చూసిన ప్రేక్షకులు బెంబేలెత్తిపోతున్నారని తెలుస్తుంది.


మహాసముద్రం అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయిందని ఈ రెంటితో పోలిస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కొంచెం బెటర్ అని తెలుస్తుంది.


పండుగ టైంలో ఏదో ఒక సినిమా చూడాలి అనుకున్న వాళ్లందరికీ ఇదే మొదటి ఛాయిస్ అవుతోందని సమాచారం . ఐతే సినిమా అనుకున్నంత సంతృప్తిని మాత్రం ఇవ్వట్లేదని తెలుస్తుంది.ఉన్న సినిమాల్లో యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కొంతమేర ఆకట్టుకునే సినిమా ఇదే అని చెప్పాలి. తొలి రోజు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌కు మంచి ఓపెనింగ్సే వచ్చాయని శని మరియు ఆదివారాల్లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే ప్రభావం చూపేలా కనిపిస్తోందని తెలుస్తుంది.. బరిలో ఉన్న మిగతా సినిమాలకు మంచి టాక్ వచ్చి ఉంటే మాత్రం తట్టుకుని నిలబడే స్థాయి చిత్రమైతే కాదని తెలుస్తుంది.


బొమ్మరిల్లు భాస్కర్ తన డిజాస్టర్ మూవీ అయిన ఆరెంజ్ తరహాలోనే మళ్లీ ప్రేమ, పెళ్లి మరియు వైవాహిక జీవితం  అంటూ డ్రై సబ్జెక్టే తీసుకున్నాడని తెలుస్తుంది.ఈసారి కూడా అయితే దాంతో పోలిస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉన్న మాట నిజమే కానీ  ఆరెంజ్ లాగా సిన్సియర్‌గా అయితే ఈ సినిమా తీయలేదని తెలుస్తుంది.సిల్లీగా అనిపించే  లాజిక్ లెస్ సీన్లు ఎన్నో వున్నాయట.


అయినా సినిమా ఈమాత్రం ఆడుతోందంటే అందులో పూజా హెగ్డే పాత్ర ముఖ్యమని తెలుస్తుంది.. టాప్ ఫాంలో ఉన్న పూజ కోసమే యూత్ ఈ సినిమాకు పెద్ద ఎత్తున వస్తున్నారంటే అతిశయోక్తి కాదని తెలుస్తుంది.. తన గ్లామర్‌తో పూజా విడుదలకు ముందే ఈ సినిమాకు మంచి బజ్ తీసుకురాగలిగిందని తెలుస్తుంది.. ఇక సినిమాలో ఆమె పాత్ర కూడా బాగానే హైలైట్ అయిందని పూజా ఫ్యాన్స్‌కు అయితే ఈ సినిమా కనువిందేనని చెప్పవచ్చు.


అందం మరియు అభినయం రెంటితోనూ పూజా ఆకట్టుకుందని ఆమె ముందు అఖిల్ ఏ రకంగానూ నిలవలేకపోయాడన్నది నిజమని చెప్పవచ్చు.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించి అఖిల్ ఖాతాలో తొలి హిట్ పడితే అందులో మేజర్ క్రెడిట్ పూజాదేనని చెప్పవచ్చు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ హీరోను సూచించే టైటిల్ పెట్టారు కానీ చివరికిది హీరోయిన్ వల్ల ఆడిన సినిమాగానే నిలవబోతోందన్నది తెలుస్తుంది. సక్సెస్ క్రెడిట్ కూడా ఆమెకే చెందుతుందని చెప్పవచ్చు. అఖిల్‌కు పెద్దగా మైలేజీ వచ్చే అవకాశాలు లేనట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: