గొర్రెల మందలానే లోకం ఉంటుంది. కొత్త‌గా ఆలోచించే ప్ర‌య‌త్నం ఏదీ చేయ‌దు. ఒక హోప్ తో న‌డిచేవాణ్ని న‌డిపించే వారు తోడైతే లేదా ఒక హోప్ తో న‌డిచేందుకు ఒక అమ్మాయికి తోడుగా ఉంటే ఎలా ఉంటుంది అన్న చిన్న లైన్ తో నే క‌థ మొత్తం న‌డిపాడు. స‌న్ రైజ్ ఇష్ట‌మా, స‌న్ సెట్ ఇష్ట‌మా అన్న క్వ‌శ్చ‌న్ తోనే సినిమా అంతా బాగానే న‌డిపాడు. సినిమాలో రైజ్ చేసిన ప్ర‌శ్న‌లు చాలా బాగున్నాయి. ఇప్ప‌టి యంగ్ జెన‌రేష‌న్ వీటిపై క్లారిటీతో ఉంద‌నే అనుకోవాలి. ఎలిజిబులిటీ అన్న వ‌ర్డ్ చుట్టూ స్టోరీని బాగానే న‌డిపాడు. ఆ పాటి క్లారిటీ మిస్ అయితే సినిమా తేడా కొట్టేది. కానీ డైరెక్ట‌ర్ ఆ విష‌య‌మై తీసుకున్న కేర్ బాగుంది.

 
చాలా రోజుల‌కు అఖిల్ కు మంచి సినిమానే పడింది. అలా అని ఇది ఆన్ స్క్రీన్ వండ‌ర్ అయితే కాదు. రొటీన్ యాక్టింగ్ తో ముర‌ళీ శ‌ర్మ, శ్రీకాంత్ అయ్యంగ‌ర్ లు విసిగిస్తారు కూడా! సుడిగాలి సుధీర్ న‌వ్వించాడు. గెట‌ప్ శ్రీ‌ను పాత్ర వ‌ర‌కూ ఓకే.. పూజా బేబీ కొన్ని సంద‌ర్భాల్లో క‌నిపించిన తీరు కూడా బాగుంది. ఇంకా ఆమె కూడా ఇంప్రూవ్ కావాలి. బ‌రువైన పాత్ర‌లకు ఆమె న‌ప్పుతుందా లేదా అన్న‌ది త‌రువాత ఒక‌వేళ ఎంచుకుంటే ఇంకొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోక త‌ప్ప‌దు.



బొమ్మ‌రిల్లు సినిమా భాస్క‌ర్ స్థాయిని పెంచింది. డైరెక్ట‌ర్ భాస్క‌ర్ ను ఓ రేంజ్ లో ఉంచింది. ప‌రుగు కూడా అంతే పేరు తెచ్చింది. ఆరెంజ్ సినిమా బాగున్నా ప‌రువు తీసింది. అలాంటి క‌న్ ఫ్యూజ‌న్ స్టోరీనే అయినా కూడా బాగుంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ మూవీ. సినిమాకు సంబంధించి ప్ర‌మోష‌న్ వ‌ర్క్ బాగానే వ‌ర్కౌట్ అయింది. బ‌న్నీ వాసు అండ్ కో ఆ విష‌య‌మై చాలానే శ్ర‌ద్ధ తీసుకున్నారు. ట్రైల‌ర్ ను చెప్పించిన మాట‌లు అన్నీ బాగున్నాయి. అవే సినిమాలోనూ ఆక‌ర్ష‌ణీయంగా విన‌ప‌డ్డాయి. ఒక అమ్మాయి చుట్టూ న‌డిచే క‌థే అయినా న‌డిపిన విధానం బాగుంది. విసుగు లేదు. అలా అని మ‌రీ అంత  ఎంట‌ర్ టైనర్ అయితే కాదు.



పూజా బేబీ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అఖిల్ ను దాటాల‌న్న ప్ర‌య‌త్నం బాగానే చేసింది. క్లైమాక్స్ డైలాగ్స్ బాగా రాశారు. అన్నింటికీ కౌంట‌ర్లు ఇప్పించాడు. డౌట్స్ క్లారిఫై చేశాడు. మ్యారేజ్ లైఫ్  లో కోరుకునేది ప‌క్క‌ప‌క్క‌న ఉండ‌డం కాదు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా ఉండడం అన్న రొమాంటిక్ సెన్స్ ను ఆఖ‌రిదాకా ఎస్టాబ్లెష్ చేశాడు డైరెక్ట‌ర్.  గ‌తంలో క‌న్నా కొంత రొమాన్స్ డోస్ పెంచాడు కూడా!ఇవ‌న్నీ అదన‌పు ఆక‌ర్ష‌ణలే కానీ అదుపు  త‌ప్పి చేసిన ప్ర‌య‌త్నాల‌యితే కావు. చాలా రోజులకు క‌నిపించిన బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ మ‌ళ్లీ త‌న మార్కు క‌థ‌నే ఎంచుకుని హిట్టు కొట్టాడు. ఫైన‌ల్ గా బొమ్మ హిట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: