మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ లో బోలెడు మైన‌స్సులు ఉన్నాయి. క‌న్ ఫ్యూజ‌న్ ఉంది. అంతే స్థాయిలో మంచి కామిడీ కూడా ఉంది. వ‌ల్గారిటీ లేదు కానీ క్లారిటీనే ఎక్క‌డో మిస్ అయింది. త‌ల్లిదండ్రుల‌ను, పిల్ల‌ల‌ను ప్ర‌భావితం చేసే సినిమానే కానీ ఆ స్థాయిలో ఆయ న రాసుకున్న స‌న్నివేశాలు లేవు. ఏదేమైన‌ప్ప‌టికీ ఎవరికి వారే కొన్ని స్థిర‌మైన అభిప్రాయాలు ఉంచుకోవాలి అని చెప్ప‌డంలో సక్సెస్ అయ్యాడు డైరెక్ట‌ర్ భాస్క‌ర్. బొమ్మ‌రిల్లు, పరుగు, ఆరెంజ్ త‌రువాత చాలా కాలం గ్యాప్ తీసుకుని ఇటుగా వ‌చ్చాడీ డైరెక్ట‌ర్. ఆయ‌న‌పై న‌మ్మ‌కంతో బ‌న్నీ వాసు నిర్మాణపు బాధ్య‌త‌లు అందుకున్నాడు. సినిమాకు సంబంధించి బాగా తెలిసిన క‌థ‌ను చెప్పే ప‌నిలో మ‌రికొన్ని దినుసులు క‌లిపి వండి వార్చాడు భాస్క‌ర్ . సీన్లలో భాస్క‌ర్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది.


భాస్క‌ర్ లో రైట‌ర్ బాగున్నాడు.. డైరెక్ట‌ర్ కన్నా..రైట‌ర్ ఔట్ పుట్ ఇంకొంత బాగుండి ఉంటే బెస్ట్ పేరెంటింగ్ కు కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు చెప్పి ఉంటే.. సినిమా స్థాయి పెరిగిపోయే ది.  డైలాగ్ తో క‌న్విన్స్ చేసే ప్ర‌య‌త్నాలు బాగానే చేశాడు. ఓవ‌ర్ చేయ‌లేదు ఎక్క‌డా.. డైలాగ్ లు వినేందుకు చాలా బాగున్నాయి. ఇక ఆర్టిస్టులు ప‌లికిన తీరు ఓకే ! అఖిల్ డైలాగ్ డెలివ‌రీ ఇంకొంచెం బాగు ప‌డితే ఆనందించాలి మ‌నం. కొన్ని మాట‌లు మింగేస్తూ ప‌ల‌క‌డం సినిమా అంత‌టా విన‌వ‌స్తూనే ఉంటుంది. పూజా బేబీ త‌న‌దైన గ్లామ‌ర్ షో చేసింది. యాక్టింగ్ స్కిల్స్ ను బాగా వినియోగించాల్సిన సినిమా అయినా ఆ మేర‌కు ఆమె చేసిన కృషి ఏంటో అంత‌గా వ‌ర్కౌట్ కాలేదు. లైఫ్ లో ఇలాంటి అమ్మాయిలు ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ ఉంటే ఎలా ఉంటారు అన్న మాట‌కు ఎగ్జాంపుల్ గా ఈ పాత్ర‌ను రాసుకున్నారు. వాట్ డూ యూ ఎక్స్  పెర్ట్ ఫ్ర‌మ్ ఎ మ్యారీడ్ లైఫ్ .. అన్న లైన్ నుంచి చాలా రాశారు. చాలా చెప్పారు.


అయితే పూజా బేబీ ఇంకాస్త బెట‌ర్ ఔట్ పుట్ ఇవ్వొచ్చు. ఇచ్చేందుకు స్కోప్ ఉన్న సినిమా కూడా! ఆమె మాత్రం ఆ దిశ‌గా ఆలోచించ‌లేద‌నే అనిపిస్తోంది. మంచి స్టోరీ.. మంచి ఆర్టిస్టులు.. అన్నీ అన్నీ మంచే కానీ చెడు ఎక్క‌డ‌? ఆ సంగ‌తి డైరెక్ట‌రే చెప్పాలి.క్యారెక్ట‌ర్ డెప్త్ ను అర్థం చేసుకుని న‌టిస్తే ఇంకాస్త ఎలివేట్ అవ్వ‌డానికి అవ‌కాశం ఉండే సినిమా ఇది. పూజా బేబీ ఆ ప‌ని చేయ‌లేదు..చేస్తే సినిమా స్థాయి  కూడా పెరిగి  ఉండేది. రైటింగ్ వాల్యూస్ కు ఓ అర్థం దొరికేది.


మరింత సమాచారం తెలుసుకోండి: