ఇండ‌స్ట్రీలో హిట్ ఉంటేనే మాట్లాడ‌తారు. కనీసం క‌న్నెత్తి చూస్తారు. ఇండ‌స్ట్రీలో ఎంట‌రై ఏళ్లు గ‌డుస్తున్నా అక్కినేని కుటుంబం నుంచి వ‌చ్చిన అఖిల్ కు హిట్ లేదు. ఆ మాట‌కు వ‌స్తే మంచి పెర్ఫార్మర్ అన్న పేరు కూడా లేదు. న‌ట‌న‌, న‌ట‌న‌తో పాటే స‌క్సెస్ ఈ రెండూ ఒకేసారి ద‌క్క‌డం క‌ష్ట‌మే కానీ.. న‌ట‌న‌లో ఇంప్రూవ్ అయి ఈ సారి హిట్ కొట్టాడు అని చెప్ప‌డం సులువు.. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న‌కు బాగా తెలిసిన ఫార్ములా బేస్డ్ సబ్జెక్ట్ తోనే పూజా బేబీ లాంటి హాట్ గాళ్ తో పెర్ఫార్మెన్స్ చేయించాల‌ని ప‌ట్టుబ‌ట్టాడు. బాగుంది.. ఆమె కూడా చేయాల్సినంత ఇంకా చెప్పాలంటే త‌న‌కు తెలిసినంత న‌టించి వెళ్లింది. అఖిల్ క‌న్నా మోర్ బెట‌ర్ అని కూడా అనిపించుకుంది. ఇంత హెవీ వెయిట్ స‌బ్జెక్ట్ కు కామెడీ సీన్స్ కొంత రిలీఫ్.. టోట‌ల్ గా భాస్క‌ర్ అనే కుర్రాడు, అఖిల్ అనే కుర్రాడితో సినిమా తీసి హిట్ కొట్టాడు అని మాత్రం చెప్ప‌గ‌ల‌ను. ఇది ఏ స్థాయి హిట్ అన్న‌ది మాత్రం చెప్ప‌లేను.
 

మొద‌టి సినిమా నుంచి ఇప్ప‌టిదాకా విజ‌యం కోసం ముఖం వాచి పోయి ఉన్నాడు అఖిల్. సినిమాలు ఎలా ఉన్నా ఆయ‌న ప‌రంగా చేయాల్సిన ప్ర‌య‌త్నాలేవో చేస్తూనే ఉన్నాడు. అయినా కూడా ల‌క్ క‌లిసి రాలేదు. మ‌ధ్య‌లో కొన్ని ఫ్యామిలీ డిస్ట్ర‌బెన్సెస్ కూడా ఉన్నాయి. వాటి తీరు ఎలా ఉన్నా మంచి సినిమా చేసేందుకు ఎప్పుడూ ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉన్నాడు కానీ ఆయ‌న‌నే ద‌ర్శ‌కులు స‌రిగా ప‌ట్టించుకోలేదు. ముఖ్యంగా వెంకీ అట్లూరి లాంటి ద‌ర్శ‌కులు మిస్ట‌ర్ మజ్నూ లాంటి సినిమాలు తీసి ఆయ‌న ప‌రువు పోగొట్టారు. వినాయ‌క్ డెబ్యూ మూవీతో చావ గొట్టాడు. ఇక చాలా మంది అఖిల్ కు బ్రేక్ ఎలా వ‌స్తుంది అని ఆరాతీశారు.



ఇలాంటి సంద‌ర్భంలో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కొంచెం హెవీ వెయిట్ స‌బ్జెక్ట్ నే ఎంచుకుని వ‌చ్చాడు. గ‌తంలో ఇదే పాయింట్ తో క‌థ రాసుకుని సినిమా తీసి ఫ్లాప్ అయ్యాడు. అదే ఆరెంజ్. ఆ పాయింట్ ను మ‌రికొద్దిగా మార్చి హీరోయిన్ ఓరియెంటేషన్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ సినిమా తీశాడు. మ్యూజిక్ బాగుండి ఉంటే ఇంకా సినిమా బాగుండేది. బొమ్మ‌రిల్లు సినిమాలో క‌నిపించిన కొన్ని స‌న్నివేశాల తీవ్ర‌త ఇక్క‌డా ఉంది. అలానే ఆరెంజ్ మూవీలో చెప్పాల‌నుకున్న పాయింట్ నే మార్చి చెప్పినా పూజా బేబీ త‌న గ్లామ‌ర్ తో కాస్త కాదు చాలా ఆక‌ట్టుకునేందుకే ట్రై చేసింది. సో.. నాగార్జున కొడుకు చోటా కింగ్ హిట్టు కొట్టాడు. ఈ అరుపు హైద్రాబాద్ ఐ మాక్స్ బ‌య‌ట విన‌ప‌డినా, మా శ్రీ‌కాకుళంలో విన‌ప‌డినా ఆనంద‌మే! కానీ ఇక‌పై చేసే సినిమాల్లో అయినా యాక్టింగ్ స్కిల్స్ , న‌డిచేవిధానం ఇంకా ఇంకొన్ని డెవ‌ల‌ప్ చేసుకుంటే బెట‌ర్.

మరింత సమాచారం తెలుసుకోండి: