బొమ్మ‌రిల్లు హిట్టు.. కొడుకుని అతిగా ప్రేమించే నాన్న.. ప‌రుగు హిట్టు.. కూతురు ప్రేమ క‌న్నా త‌న ప్రేమే గొప్ప‌ది అని అనుకునే నాన్న .. ఆరెంజ్..డోంట్ సాక్రిఫైజ్ ఎనీథింగ్ ఫ‌ర్ ఎనీబ‌డీ అని  చెప్పిన సినిమా.. ఫ్లాప్.. రెండు హిట్లు. ఒక ఫ్లాప్.. అయినా ఆయ‌నం టే ఇండ‌స్ట్రీకో గౌర‌వం. ఆయ‌న సినిమాలంటే ఓ గౌర‌వం.. ప్రేమ‌, గౌర‌వం ఉన్న‌చోటే అవ‌కాశాలు వ‌స్తాయి. ఆయ‌న‌కూ వ‌స్తున్నాయి కానీ ఆయ‌న త‌న పాత సినిమాల మూడ్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. వ‌స్తే మంచి సినిమాలు.. వ‌స్తేనే మంచి సినిమాలు.

అప్ప‌టిదాకా ఉన్న సినిమాల‌కు, త‌న సినిమాల‌కు ఉన్న తేడా ఏంటో స్ప‌ష్టంగా చూపించాడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ లో కావాల్సినన్ని విలువ‌లు, వాటి చుట్టూ తిరిగే క్యారెక్ట‌ర్లు ఇవ‌న్నీ ఓ సినిమాకు అదీ ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు ఎడిష‌న‌ల్ అట్రాక్ష‌న్ కావ‌డ‌మే వింత. ఆశ్చ‌ర్య‌పోద‌గ్గ విష‌యం. పేరెంటింగ్ కు సంబంధించి ఆయ‌న సినిమాలు అన్నీ బాగుంటాయి. మంచి పేరెంటింగ్ లేక‌పోతే మంచి సొసైటీ ఎక్క‌డి నుంచి వ‌స్తుంది. క‌నుక పిల్లల పెంప‌కం, వారి ప్రేమ‌, వివాహ సంబంధ విష‌యా లు ఇవ‌న్నీ కూడా ఎంతో ఉద్వేగంగా చూపించే డైరెక్ట‌ర్ భాస్క‌ర్. బొమ్మ‌రిల్లు, ప‌రుగు, ఆరెంజ్ సినిమాలు అలా తీసినవే.

సినిమాకూ సినిమాకూ ఆయ‌న పెరుగుతూనే వ‌చ్చాడు. ఆయ‌న స్థాయి కూడా పెరిగింది. దీంతో ఆయ‌న‌ను న‌మ్మొచ్చు అన్న భావ‌న ప్రేక్ష‌కుల్లో వ‌చ్చింది. ఆయ‌నను న‌మ్మొచ్చు అన్న భావ‌న నిర్మాత‌ల్లోనూ వ‌చ్చింది. అటుపై ఆయ‌న సినిమాలు పెద్ద‌గా ఆడ‌లేదు. ఇండ‌స్ట్రీకి క్ర‌మ‌క్ర‌మం గా దూరం అవుతూ వ‌చ్చారు. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ తో రీ ఎంట్రీ ఇచ్చారు. అయినా స‌రే గ‌త చిత్రాల కోవ‌లోనే ఆయ‌న ఆలోచ‌నలు ఉన్నాయి. కొత్త క‌థ ఏదీ ఆయ‌న ఎంచుకోక‌పోయినా ఈ స్టోరీలో కామెడీ బాగా పండించారు అని చెప్పుకునేందుకు అవ‌కాశం ఇచ్చారు. ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు ఇంపార్టెన్స్ ఇచ్చారు. డైలాగ్స్ బాగున్నా గ‌త చిత్రాల ప్ర‌భావ‌మే వాటిపై ఉంది. ఇక ఆయ‌న ఆ మూడ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సినిమాలు చేయాలి. మంచి సినిమాలు చేయాలి. గుడ్ పేరెంటింగ్ ఎలా ఉండాలో చెబుతూనే విభిన్న క‌థ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అలా చేస్తేనే ఆయ‌న నిల‌దొక్కుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: