ప్రముఖ మలయాళ నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కూతురిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కీర్తి సురేష్ తన ప్రతిభ తో ప్రత్యేక క్రెడిట్ ను సంపాదించుకున్నారు. తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకుంది.  కీర్తి సురేష్ అనే పేరు వినగానే సావిత్రి మళ్ళీ పుట్టిందని అనిపిస్తుంది. అంతలా మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించింది కీర్తి. ఆ సినిమాలో కీర్తి సురేష్ నటన నిజంగా మహానటి సావిత్రి మళ్ళీ దిగి వచ్చారా అనిపించేలా...ఆమె నిజమే అని తలపించేలా జీవం పోసింది. సావిత్రి పాత్ర చేయడం కోసం తను ఎంత కష్టపడింది అంటే ఆమె ఎలా ఉండేవారు ఆమె ప్రతి కదలిక, ఏ ఎమోషన్ కి ఎలా రియాక్ట్ అవుతారు. ఇలా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని అలా తనని తాను మార్చుకుని ప్రతిబింబించింది.

అందుకు తగ్గ ఫలితాన్ని కూడా అందుకున్నారు కీర్తి. మహానటి చిత్రం తర్వాత జాతీయ స్థాయిలో బాగా ఫేమస్ అయ్యారు ఈ హీరోయిన్. నేను లోకల్, అజ్ఞాత వాసి, నేను శైలజ, రెమో, రంగ్ దే వంటి చిత్రాలతో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ అంటేనే గ్లామర్ ఇక నేటి తరం హీరోయిన్ల విషయానికొస్తే మన టాలీవుడ్ లోనూ బాలీవుడ్ ను తలపించే గ్లామర్ ని ఒలకబోస్తూ స్కిన్ షో ఓ రేంజ్ లో చేస్తున్నారు చాలామంది హీరోయిన్లు. అయితే కీర్తి సురేష్ మాత్రం ఇటువంటి వారికి పూర్తిగా భిన్నం. స్కిన్ షో కి అస్సలు ఒప్పుకోని కథానాయకులలో ఈమె కూడా ఒకరు. కెరియర్ ప్రారంభం లోనే స్కిన్ షో చేయనని చెప్పిన కీర్తి సురేష్ తన సహజమైన అందం అభినయంతో కెరియర్ లో దూకుడు పెంచింది.

ఇప్పటి వరకు మోతాదుకు మించి ఎక్స్పోజింగ్ ఇవ్వకుండా ప్రధానంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫేవరెట్ హీరోయిన్ గా మారిన కీర్తి సురేష్... ఈ మధ్య కాలంలో ఈమె నటించిన చిత్రాలు చూస్తుంటే స్కిన్ షో కుదరదని చెప్పి తాను గీసుకున్న హద్దులను నెమ్మది నెమ్మదిగా దాటుతుందనే చెప్పాలి. మొదట్లో కీర్తి రంగ్ దే వంటి చిత్రాల్లో కీర్తి సురేష్ గ్లామర్ డోస్ కాస్త పెంచింది. మరి ఈ బామ చాలామంది హీరోయిన్ల లా స్కిన్ షో కి ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలెట్టిందేమో అంటూ కొందరు అంటున్నారు. అగ్ర హీరోల సరసన పెద్ద ఆఫర్లు అందుకోవాలంటే గ్లామర్ డోస్ పెంచక తప్పదని అనుకుందో ఏమో గానీ ఈ మధ్య కాస్త స్కిన్ షో చేస్తోంది కీర్తి అంటున్నారు నెటిజన్లు. ఇక ప్రస్తుతం చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రం లో చిరు కి చెల్లిలి పాత్రలో నటిస్తున్నారు కీర్తి సురేష్. ఇక షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా సర్కారువారి పాట మరియు సఖి చిత్రాలు రెడీగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: