కీర్తి సురేష్ కి మొదటి నుంచి హోంలీ అమ్మాయి అనే పేరు ఉంది. సినిమాల్లో కూడా ఆమె పాత్రలు అన్ని అలాగే ఉన్నాయి. ప్రస్తుతం హీరోయిన్స్ అంత గ్లామరస్ రోల్స్ చేస్తూ దూసుకెళ్తుంటే కీర్తి సురేష్ మాత్రం పక్కింటి అమ్మాయి రోల్స్ చేస్తూ టాప్ హీరోలతో ఛాన్సులు కొట్టేస్తుంది.అలాగే కీర్తి కెరీర్ మీద మహానటి సినిమా ప్రభావం చాలా ఉందని అని చెప్పాలి.

 ఆమెకి ఈ సినిమా ఎంత పెద్ద గుర్తింపు తెచ్చిందో అందరికి తెలిసిందే. కానీ కొంత ఆమె కెరిర్ కి మహనటి చెడు చేసింది అని కూడా చెప్పొచ్చు. అది ఎలా అంటే ఈ సావిత్రి గారి లాంటి పాత్ర చేసిన కీర్తి కి ఏ డైరెక్టర్స్ గ్లామరస్ రోల్స్ ఇవ్వడంలేదు. ఇలా హోంలీ అమ్మాయి పాత్రలతో కీర్తి కెరీర్ ఎంత వరకు వెళ్తుంది అనేది ప్రశ్న గా మారింది. కానీ కీర్తి కి మాత్రం గ్లామర్ రోల్స్ చేయడం ఇష్టంగానే కనిపిస్తుంది.ఆమె సోషల్ మీడియాలో కీర్తి ఫోటోషూట్స్ చూస్తే మనకు ఆ విషయం అర్థం అవుతుంది. ఇక ఆమె ప్రస్తుతం నటిస్తున్న మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో మంచి గ్లామరస్ రోల్ దొరికినట్టే కనిపిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్స్ కూడా కీర్తి సురేష్ గ్లామరస్ పాత్రలే ఎంచుకుంటుంది అని టాక్. ఇక నాని నటిస్తున్న దసరా సినిమాలో కూడా కీర్తి సురేష్ కి పల్లెటూరి అమ్మాయి పాత్ర చేయబోతోంది.

సినిమా ఫస్ట్ లుక్ ఈమధ్యనే విడుదలైంది. నేను లోకల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాని కీర్తి సురేష్  జోడి మళ్ళీ ఈ దసరా సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నాని లుక్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అని టాక్. కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమా త్వరలోనే మొదలుకాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: